COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Renault Kiger Price: భారత్‌లో తయారయ్యే కాంపాక్ట్ SUV సెగ్మెంట్ కార్లు ప్రపంచ మార్కెట్‌లో సంచనం సృష్టిస్తున్నాయి. పోను పోను మార్కెట్‌లో కాంపాక్ట్ SUVల డిమాండ్‌ విపరీతంగా పెరిపోతోంది. ముఖ్యంగా అతి తక్కువ ధరల్లో లాంచ్‌ చేసే ఎస్‌యూవీలకు మంచి ప్రజాదరణ ఉంది. అయితే మీరు కూడా ఎక్కువ మైలేజీని ఇచ్చే మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కాంపాక్ట్ SUV Renault Kiger మంచి ఎంపిక భావించవచ్చు. ఇది అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో పాటు అధిక మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ కారుపై కంపెనీ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 


రెనాల్ట్ కిగర్‌ ఫీచర్లు: 
రెనాల్ట్ కిగర్‌ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే లాంటి ప్రీమియం కనెక్టీవిటీలతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ కారు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు వివిధ రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు  పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ స్పెషల్‌ ఫీచర్స్ కూడా లభిస్తోంది. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 4 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా లభిస్తున్నాయి. 


దీంతో పాటు ఈ కారు హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ కూల్ ఫీచర్లు సిస్టమ్‌తో కూడా లభిస్తోంది. అలాగే బ్యాక్‌లోని రోడ్డును క్లుప్తంగా చూసేందుకు బ్యాక్‌ కెమెరా కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు వెనుక పార్కింగ్ సెన్సార్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ సెటప్‌లు కూడా లభిస్తున్నాయి. ఇక ఈ కారుకు సంబంధించిన ఇంజన్‌ వివరాల్లోకి వెళితే, ఇది శక్తివంతమైన 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ ఇంజన్ 98.63bhp శక్తిని, 152 Nm టార్క్‌ను ఉత్పత్తిని చేసే సమర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అలాగే ఈ Renault Kiger కారు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ కారు మైలేజీ వివరాల్లోకి వెళితే  లీటరుకు 20.62 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ధర చూస్తే, కంపెనీ దీనిని ఎక్స్-షోరూమ్ ధర ₹6.50 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు వివిధ రకాల వేరియంట్స్‌ను విక్రయిస్తోంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్‌లో కిగర్ టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ వంటి పెద్ద కార్లకు పోటీగా నిలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి