Cheap and Best 7 Seater: మహీంద్రా, ఇన్నోవా, మారుతి సుజుకి, హ్యుండయ్, హోండా, టాటా మోటార్స్, కియా మోటార్స్, రెనాల్ట్ ఇలా అన్ని కంపెనీలు 7 సీటర్ కార్లు లాంచ్ చేశాయి. 7 మంది సులభంగా కూర్చుని హాయిగా ప్రయాణం చేసేందుకు అద్బుతమైన ఇంటీరియల్, ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో లాంచ్ అయిన రెనాల్ట్ ట్రైబర్ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ ఎంపీవీ ఇండియాలో ఇప్పటికే లాంచ్ అయింది. ట్రైబర్ లుక్ కూడా స్టైలిష్‌గా, అత్యాధునిక డిజైన్‌తో ఉంటుంది. ఈ కారులో లార్జ్ గ్రిల్, స్లీక్ హెడ్ ల్యాంప్స్, మస్క్యులర్ బంపర్ ఉన్నాయి. ఇందులో 16 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్ మరో ప్రత్యేకత. ట్రైబర్‌లో సువిశాలమైన, ఫ్రీ ఇంటీరియర్ స్పేస్ ఉంటుంది. అంటే 7 మంది హాయిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. టచ్ స్క్రీన్ ఇన్‌ఫో‌టైన్‌మెంట్, రేర్ ఏసీ, కూలింగ్ గ్లవ్ బాక్స్ ఉన్నాయి. హెడ్ రూమ్, లెగ్ రూమ్ కూడా ఎక్కువే. ఎంపీవీ కొనే ఆలోచన ఉంటే రెనాల్ట్ ట్రైబర్ బెస్ట్ ఆప్షన్.


రెనాల్ట్ ట్రైబర్‌లో ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. రెనాల్ట్ ట్రైబర్‌లో 1.-0 లీటర్ , 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ , ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రెనాల్ట్ ట్రైబర్‌లో 84 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. థర్డ్ రో ఫోల్ట్ చేస్తే 625 లీటర్ వరకూ బూట్ స్పేస్ పెంచుకోవచ్చు. 


రెనాల్ట్ ట్రైబర్‌లో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, సెంటర్ కన్సోల్‌లో కూల్డ్ స్టోరేజ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, స్టీరింగ్ మౌంటెడ్ మ్యూజిక్, ఫోన్ కంట్రోల్స్, సెకండ్ ధర్డ్ రో ఏసీ వెంట్స్, ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ ధర 6 లక్షల నుంచి 8.98 లక్షల వరకూ ఉంటుంది. 


Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, DA, TA, HRA భారీగా పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook