RBI Repo Rates: లోన్లు తీసుకున్న వారికి ఆర్‌బీఐ నుంచి గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రెపో రేట్లను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తే.. బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ రేట్లు కూడా తగ్గుతాయి. ఇటీవల ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయని విషయం తెలిసిందే. ఈ నిర్ణయం నిపుణులను ఆశ్చర్యపరిచింది. వచ్చే ఏడాది కూడా ఆర్‌బీఐ ఇదే వైఖరిని కొనసాగించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో రెపో రేటు తగ్గింవచ్చని భావిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ద్రవ్య విధాన సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ పాలసీ రేటు రెపోను 6.5 శాతం వద్దనే కొనసాగించింది. గతంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు 2022 మే నెల నుంచి వరుసగా ఆరుసార్లు రెపో రేటును పెంచింది. ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం రేటు భారీగా తగ్గడంతో రెపో రేటులో మార్పు చేయలేదు. ద్రవ్యోల్బణం రేటు 4 శాతానికి వచ్చేవరకు ఆర్‌బీఐ కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉంది. 


ఈ ఏడాది మార్చి నెలలో రిలీజ్ చేసిన ద్రవ్యోల్బణం గణాంకాలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.66 శాతానికి తగ్గింది. ఏప్రిల్ 6న ద్రవ్య విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ.. పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలోనే రెపో రేటును 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం మనదేశంలో ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని కమిటీ అంచనా వేస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో తీవ్ర అనిశ్చితి నెలకొనగా.. మన దేశంలో హోటళ్ల వంటి సేవా రంగాలకు డిమాండ్‌ పెరిగిందని పేర్కొంది. 


Also Read: LSG vs GT Dream11 Tips: గుజరాత్ టైటాన్స్‌తో లక్నో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీకోసం..   


ద్రవ్య విధానంలో తీసుకున్న నిర్ణయాలతో రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 5.66 శాతానికి తగ్గిందని.. ఇది గతేడాది ఏప్రిల్ నాటికి 7.8 శాతంగా ఉందని ఆర్‌బీఐ వెల్లడించింది. 2023-24 జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది మరింత తగ్గి 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2022 ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉండడంతో రెపో రేటును ఆరుసార్ పెంచాల్సి వచ్చింది. 4 శాతం నుంచి 6.50 శాతానికి మొత్తంగా 2.50 శాతం పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ కూడా మొదలవుతుంది. వచ్చే ఏడాది నుంచి పాలసీ రేట్లు తగ్గుతాయని నిపుణులు చెబుతుండగా.. అక్టోబరు నుంచి రేట్లు తగ్గించవచ్చని అంచనా వేసింది బ్రోకరేజ్ కంపెనీ నోమురా. చూడాలి మరి ఆర్‌బీఐ నిర్ణయాలు ఎలా ఉంటాయో..! 


Also Read: Viveka Murder Case Latest Update: డీఎన్‌ఏ టెస్టుకు రెడీ.. అప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నారు: వివేకా రెండో భార్య సంచలన స్టేట్‌మెంట్ 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook