RBI Clarifies on Star Series Bank Notes: రూ.500 నోట్లపై సోషల్ మీడియాలో నిత్యం వార్తలు వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లు రద్ద చేసి రూ.1000 నోట్లు తీసుకువస్తుందని.. నోటుపై స్టార్‌ (*) గుర్తు ఉంటే చెల్లవని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రూ.500 నోట్లను రద్దు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. నక్షత్రం గుర్తు (*) ఉన్న నోట్‌పై కూడా ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంకు నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. స్టార్ గుర్తు లేని బ్యాంకు నోటు మాదిరే.. స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా చట్టబద్ధమైనేవని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నంబర్ ప్యానెల్‌పై నక్షత్రం (*) గుర్తు ఉన్న నోట్ల చెల్లుబాటుపై ఇటీవల కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్‌బీఐ పేర్కొంది. 2006 వరకు ముద్రించిన నోట్లు సీరియల్ నంబర్లలో ఉండేవని తెలిపింది. ఈ నోట్లన్నింటికీ సీరియల్ నంబర్‌తో పాటు సంఖ్యలు, అక్షరాలతో ప్రిఫిక్స్ ఉండేవని.. ఈ నోటు 100 ముక్కల ప్యాకెట్‌లో జారీ చేసినట్లు చెప్పింది. ఆ తరువాత చినిగిపోయిన లేదా దెబ్బతిన్న నోట్లను మళ్లీ ముద్రించడానికి స్టార్ సిరీస్ విధానాన్ని అవలంబించినట్లు వెల్లడించింది. స్టార్ సిరీస్ నోట్లు సాధారణ కరెన్సీ నోట్ల మాదిరే చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. 


సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్. నోట్లకు సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉంటే.. తమ అధికారిక వెబ్‌సైట్‌ https://rbi.org.in/home.aspx ను సందర్శించాలని సూచించింది. నోట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరింది. కాగా.. రూ.2000 నోటును ఇంకా మార్చుకోని వారు ఉంటే.. త్వరగా మార్చుకోవాలని తెలిపింది. బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసుకోవచ్చని లేదా మరో నోట్లను తీసుకోవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు చివరి అవకాశం ఉండగా.. గడువులోగా రూ.2000 నోట్లు తిరిగి వస్తాయని ఆర్‌బీఐ చెబుతోంది.


 


Also Read: BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!  


Also Read: Pune Woman Rape Case: అప్పు చెల్లించలేదని దారుణం.. భర్త ఎదురుగానే భార్యపై అఘాయిత్యం   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి