Bank Holidays Full List: 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో బ్యాంకులసు సెలవులు తక్కువే ఉన్నాయి. కానీ మార్చ్  నెలలో మాత్రం సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులో ఆర్బీఐ జాబితా విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ వినియోగం ఎంతగా పెరిగినా బ్యాంకులకు నేరుగా వెళ్లే పని తప్పకుండా ఉంటోంది. ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలే కన్పిస్తున్నాయి. అయినా బ్యాంకుతో ప్రత్యక్షంగా కొన్ని పనులుంటాయి. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా ప్రతి నెల రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలు కచ్చితంగా సెలవులుంటాయి. ఇవి కాకుండా అదనంగా పబ్లిక్ హాలిడేస్ ఉంటుంటాయి. ఈసారి వివిధ బ్యాంకులకు మార్చ్ నెలలో 14 రోజులు సెలవులున్నాయి. 


మార్చ్ 1 మిజోరాంలో చాప్పాట్ కుట్ పండు సందర్భంగా సెలవు
మార్చ్ 6న మహర్షి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా సెలవు
మార్చ్ 8వ తేదీన మహా శివరాత్రి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చ్ 12న రంజాన్ నెల ప్రారంభం
మార్చ్ 22వ తేదీన బీహార్ డే పురస్కరించుకుని ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు
మార్చ్ 23వ తేదీన భగత్ సింగ్ అమరవీరుల దినోత్సవం..కొన్ని రాష్ట్రాల్లో సెలవు
మార్చ్ 25న హోలీ సందర్భంగా బ్యాంకులకు సెలవు
మార్చ్ 26న మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు
మార్చ్ 28న మాండీ క్రిస్టియన్ల పండుగ
మార్చ్ 31న ఈస్టర్ హాలిడే


ఇవి కాకుండా మార్చ్ 9, 23 తేదీల్లో రెండు, నాలుగవ శనివారం సెలవులున్నాయి. మార్చ్ 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం సెలవులున్నాయి.


Also read: RK U Turn: మళ్లీ సొంతగూటికి చేరనున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, అసలేం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook