RBI On Debit Card And Credit Card: క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలలో కీలక మార్పులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. డెబిట్, క్రెడిట్ , ప్రీపెయిడ్ కార్డ్‌లను జారీ చేసే నియమాలకు సంబంధించి డ్రాఫ్ట్ సర్క్యులర్‌లో పేర్కొంది. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయడానికి కార్డ్ నెట్‌వర్క్‌లు కార్డ్ జారీ చేసే బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ సంస్థలతో ఒప్పందం కలిగి ఉన్నాయని తెలిపింది. ఇది వినియోగదారులకు అనుకూలంగా లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆగస్టు 4వ తేదీలోపు ఈ సర్క్యులర్‌పై వాటాదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్‌బీఐ తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఏదైనా నిర్దిష్ట నెట్‌వర్క్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీ పెయిడ్ కార్డ్ జారీ చేయకూడదు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీ పెయిడ్ కార్డ్ అన్ని నెట్‌వర్క్‌లలో ఉపయోగించడానికి పర్మిషన్ ఇవ్వాలి. ప్రస్తుతం బ్యాంకులే నెట్‌వర్క్ సంస్థలను నిర్ణయిస్తుండగా.. వినియోగదారుల అభిప్రాయం తీసుకోవాలని తెలిపింది. వీసా కార్డు, మాస్టర్‌ కార్డు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, రూపే తదితర చెల్లింపు నెట్‌వర్క్‌లు దేశంలో ఉన్న విషయం తెలిసిందే. కస్టమర్లకు తమకు కావాల్సిన నెట్‌వర్క్‌ను ఎంచుకునేలా ఆర్‌బీఐ అవకాశం కల్పిస్తోంది. 


కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్ జారీచేసేవారు.. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకుల మధ్య ఇప్పటికే ఉన్న ఏర్పాట్లు వినియోగదారులకు అనుకూలంగా లేవని ఆర్‌బీఐ పేర్కొంది. కార్డ్ జారీ చేసేవారు ఇతర కార్డ్ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా నిరోధించే కార్డ్ నెట్‌వర్క్‌లతో ఎలాంటి ఏర్పాటు లేదా ఒప్పందాన్ని కుదుర్చుకోకూడదని స్పష్టం చేసింది. సవరణ లేదా పునరుద్ధరణ సమయంలో కార్డ్ జారీ చేసేవారు, కార్డ్ నెట్‌వర్క్‌లు ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా చూస్తాయని కూడా తెలిపింది. వాటాదారుల అభిప్రాయాలను సేకరించిన తరువాత ఈ ఏడాది అక్టోబర్ 1వ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.  


Also Read: IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు


Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook