SIP For Retirement Goal : మనలో చాలా మంది పెట్టుబడుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు భారంగా మారుతుంది. అయితే ఉద్యోగంలో చేరిన వెంటనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే చివరి క్షణాల్లో సంతోషంగా జీవనం గడపవచ్చు. చిన్న వయస్సులోనే..ఉద్యోగంలో చేరిన వెంటనే కొంత డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలుంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా..పూర్తి ప్రయోజనం పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు 25 ఏండ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన తర్వాత..రిటైర్మెంట్ అనంతరం మీ చేతికి ఎంత డబ్బు అందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం   25 ఏండ్లకే సిప్ పద్ధతిలో అంటే ప్రతి నెల కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే దాదాపు 35 ఏండ్ల వరకు పెట్టుబడి పెట్టాలి. రిటైర్మెంట్ నాటికి రూ. 10కోట్ల ఫండ్ మీకు వస్తుంది. రూ. 10 కోట్ల ఫండ్ ను వెంటనే పొందేందుకు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మరింత సులభంగా ఉంటుంది. కానీ మీరు ఎంత ఆలస్యం చేస్తే..ఈ ఫండ్ అంత ఎక్కువగా పోతుంది. 


ఒక వేళ 20ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టినట్లయితే..


నెలవారీ SIP: రూ. 8500


వార్షిక రాబడి: 12%


\వ్యవధి: 40 సంవత్సరాలు


40 సంవత్సరాల తర్వాత SIP విలువ: రూ. 10,10,00,572 (దాదాపు రూ. 10 కోట్లు)


40 ఏళ్లలో మొత్తం పెట్టుబడి: రూ. 40,80,000 (దాదాపు రూ. 41 లక్షలు)


మొత్తం పెట్టుబడికి ఎన్ని రెట్లు రాబడి: 25 రెట్లు


Also Read : EPFO Pension: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPS 95 పెన్షన్ స్కీం కింద మినిమం రూ. 15 వేలు పెన్షన్ పొందే చాన్స్


25ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టడం:


నెలవారీ SIP: రూ. 15,500


వార్షిక రాబడి: 12 శాతం


వ్యవధి: 35 సంవత్సరాలు


35 సంవత్సరాల తర్వాత SIP విలువ: రూ. 10,06,76,671 (దాదాపు రూ. 10 కోట్లు)


35 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ. 65,10,000 (దాదాపు రూ. 65 లక్షలు)


మొత్తం పెట్టుబడిపై ఎన్ని రెట్లు రాబడి: 15.46 రెట్లు


Also Read : Today Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర .. తులం పసిడి ధర ఎంతంటే?


30ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టడం:


నెలవారీ SIP: రూ 28500


వార్షిక రాబడి: 12 శాతం


వ్యవధి: 30 సంవత్సరాలు


30 సంవత్సరాల తర్వాత SIP విలువ: రూ. 10,06,02,543 (దాదాపు రూ. 10 కోట్లు)


30 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ. 1,02,60,000 (సుమారు రూ. 1 కోటి)


మొత్తం పెట్టుబడికి ఎన్ని రెట్లు రాబడి: 10 రెట్లు


(Disclaimer: పైన  తెలిపిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ తెలిపిన సమాచారం ఆర్థిక సలహాగా భావించరాదు. జీ తెలుగు న్యూస్ వెబ్ పోర్టల్ ఎలాంటి  ఆర్థిక సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులు, ఆర్థిక నిర్ణయాలకు మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. ఆర్థిక సలహాల కోసం నిపుణుల సలహాలు సూచనలు పొందండి.)


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.