Royal Enfield Classic 350 Bobber Price In India: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ అంటే ఇష్టపడని వారుండరు. యువతైతే ఎంతో ఇష్టంగా ఈ బైక్‌లను కొంటూ ఉంటారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైక్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. త్వరలోనే మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ బైక్‌ 250సీసీ ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ క్లాసిక్ 350 ఆధారిత బాబర్ బైక్ పేరుతో విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన రోడ్ టెస్ట్‌ కూడా పూర్తి చేసుకుంది. ఇది చూడడానికి అచ్చం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ బైక్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బాబర్‌ మోటర్‌ సైకిల్‌ను కంపెనీ రోడ్లపై పరీక్షిస్తుండగా కొంతమంది ఫోటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ బైక్‌ భారీ ఇందన సామర్థ్యం కలిగిన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటర్‌ సైకిల్‌  రెండు వైపులా తిరిగే ఫెండర్లు సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌లోని ఫీచర్స్‌ అచ్చం క్లాసిక్ 350 మాదిరిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్లాట్ హ్యాంగర్ హ్యాండిల్‌బార్ కూడా కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మోటర్‌ సైకిల్‌లో కంపెనీ మంచి రైడింగ్ అనుభూతిని పొందడానికి సింగిల్ పీస్ సీటును అందించబోతున్నట్లు తెలుస్తోంది. 


ఇక  క్లాసిక్ 350 బాబర్ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన ఇంజన్‌ వివరాల్లోకి వెళితే, ఈ బైక్‌ ఎంతో శక్తివంతమైన 349cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఇంజన్‌ 27Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా 20.2bhp శక్తిని అందిస్తుంది. అలాగే ఇది బ్యాక్‌ డిస్క్ బ్రేక్‌ సిస్టమ్‌తో రాబోతోంది. దీంతో పాటు  5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇక దీని లాంచ్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ అధికారిక సమాచారం ప్రకారం కంపెనీ దీనిని ఈ ఏడాది చివరి వారంలో అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే దీని ధర రూ.2 లక్షల లోపే ఉండే ఛాన్స్‌ ఉందని మార్కెట్‌లో టాక్ నడుస్తోంది.


ఇది కూడా చదవండి:  2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అదనపు ఫీచర్లు:
సైడ్ స్టాండ్ ఇండికేటర్
లో-బ్యాటరీ ఇండికేటర్
ట్రిప్ మీటర్
ఎకోనామి డ్రైవింగ్ ఇండికేటర్
బ్లాక్ క్రోమ్ ఎక్సాస్ట్ బైక్‌కు స్పోర్టీ లుక్‌
 వైబ్రేషన్ తగ్గించే పద్ధతి
17-అంగుళాల అల్లాయ్ వీల్స్
డబుల్ షాక్ అబ్సార్బర్లు
టెలిస్కోపిక్ ఫోర్కులు
డ్యూయల్ ఛానల్ ABS


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి:  2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి