Royal Enfield recall: ప్రముఖ బైక్​ల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​ భారీ రీకాల్​ ప్రకటించింది. బ్రేకులో సమస్య కారణంగా 26,300 బైక్​లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ సోమవారం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిడ్​ సైజ్​ సెగ్మెంట్​లోని క్లాస్​ 350 మోడల్​ (Royal Enfield Classic 350) బైక్​ వెనక వైపు బ్రేక్​లో సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు రాయల్​ ఎన్​ఫీల్డ్​ వెల్లడించింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని లోపాలున్నట్లు అనుమానిస్తున్న బైక్లను రీకాల్ చేయనున్నట్లు వివరించింది.


సమస్య వివరాలు..


రైడింగ్​లో బ్రేక్​ పెడల్​పై అధిక లోడ్ వేయం వల్ల.. రెస్పాన్స్​ బ్రాకెట్ దెబ్బతినే సమస్య ఉన్నట్లు గుర్తించామని కంపెనీ (Royal Enfield Classic 350 brake issue) వెల్లడించింది. దీని వల్ల శబ్దంతో పాటు.. బ్రేక్​ పని చేసే సామర్థ్యం దెబ్బతినే ప్రమాదముందని తెలిపింది.


అన్ని క్లాస్ 350 బైకుల్లో ఈ సమస్య ఉందా?


క్లాస్ 350 బైకులన్నింటిలో ఈ సమస్యలేదని రాయల్ ఎన్​ఫీల్డ్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన బైక్​లో మాత్రమే ఈ సమస్యను గుర్తించినట్లు చెప్పింది.


సమస్య ఉన్న బైక్​లను కొన్న కస్టమర్లను.. రాయల్​ ఎన్​ఫీల్డ్ సర్వీస్​ బృందాలు లేదా డీలర్​షషిప్​లే స్వయంగా సంప్రదిస్తారని తెలిపింది కంపెనీ.


వినియోగదారులు కూడా కంపెనీ వెబ్​సైట్​, దగ్గర్లోని రాయల్​ ఎన్​ఫీల్డ్​ సర్వీస్ సెంటర్లను సంప్రదించడం ద్వారా వారి బైక్​లలో సమస్య ఉందా? లేదా అనే విషయం తెలుసుకోవచ్చని వివరించింది.


ఇంతకు ముందు మే నెలలో కూడా వేరే కారణాలతో క్లాసిక్, బుల్లెట్​ మోడళ్లలోని 2,36,966 యూనిట్లను రీకాల్ చేసింది రాయల్ ఎన్​ఫీల్డ్​.


Also read: IPPB Alert: ఖాతాదారులకు ఐపీపీబీ షాక్​- వచ్చే ఏడాది నుంచి ఛార్జీల బాదుడు!


Also read: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... అయితే ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook