RRR Effect: మల్టీప్లెక్స్ ఇండస్ట్రీకి కలిసొచ్చిన ఆర్ఆర్ఆర్ రిలీజ్... 25 నెలల గరిష్ఠానికి స్టాక్స్..
RRR effect on Multiplex Industry: ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ విడుదలతో మల్టీప్లెక్స్ ఇండస్ట్రీకి కూడా బాగా కలిసొచ్చింది.
RRR effect on Multiplex Industry: ఆర్ఆర్ఆర్ మేనియా మేకర్స్‌కే కాదు మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు బాగా కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల నేపథ్యంలో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు పీవీఆర్ ప్రైవేట్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ స్టాక్స్ 25 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం పీవీఆర్ లిమిటెడ్ స్టాక్స్ రూ.1839 వద్ద, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ స్టాక్స్ రూ.479 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ రెండు సంస్థల స్టాక్స్ చివరిసారిగా ఫిబ్రవరి, 2020లో ఈ స్థాయిలో ట్రేడ్ అయ్యాయి.
ఇవాళ ఉదయం 11గంటలకు ఐనాక్స్ లీజర్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ 6 శాతం మేర పెరిగి రూ.468కి చేరింది. గడిచిన ఆరు సెషన్లలో ఐదు సెషన్లలో లాభాలను చవిచూసిన ఐనాక్స్ లీజర్ స్టాక్స్ 17 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ 3 శాతం మేర పెరిగి రూ.1827కి చేరింది. ఈ నెల 7 నుంచి ఇప్పటివరకూ పీవీఆర్ స్టాక్ 22 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది మొత్తంగా 41 శాతం మేర పెరిగింది.
కరోనా ప్రభావం తగ్గిపోవడం.. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు తెరుచుకోవడం.. దాదాపుగా అన్ని రాష్ట్రాలు థియేటర్లలో పూర్తి ఆక్యపెన్సీకి అనుమతినివ్వడం.. తదితర అంశాల కారణంగా థియేటర్ ఇండస్ట్రీ మళ్లీ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు మల్టీప్లెక్స్ స్టాక్స్ కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల విడుదలైన ఝండ్, ది కశ్మీర్ ఫైల్స్, బచ్చన్ పాండే, తాజాగా ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో మల్టీప్లెక్సులు జనాలతో కళకళలాడుతున్నాయి.
Also Read: Realme C31: రియల్మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!
Also read: Disney plus hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook