Realme C31: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్.. రియల్మీ బడ్జెట్ సెగ్మెంట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ముఖ్యంగా బడ్జెట్ పోర్ట్‌ఫోలియో అయిన సీ-సిరీస్‌లో ఈ కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మోడల్ ఇండోనేషియాలో విడుదలైంది. అదే మోడల్‌ను త్వరలో ఇండియాలో విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. రియల్మీ సీ31 పేరుతో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ఈ మొబైల్‌ను మార్చి 31న భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.
రియల్మీ సీ31 ఫీచర్లు
ఇండోనేషియాలో విడుదలైన మోడల్ ప్రకారం.. కొత్త ఫోన్ బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.
- 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- యూనిఎస్ఓసీ టీ612 ప్రాసెసర్
- 13 మెగా పిక్సెల్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా
- 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్.. వంటి అధునాతన ఫీచర్లతో ఈ మొబైల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ధర అంచనాలు..
రియల్మీ సీ31 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,500గా ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి.
ఇక 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,600గా నిర్ణయించొచ్చని సమాచారం.
ఈ మొబైల్ డార్క్ గ్రీన్, లైట్ సిల్వర్ కలర్స్‌లో లభ్యమవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారమంతా ఇండినేషియాలో విడుదలైన వేరియంట్ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. మరి ఇండియాలో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు ఏవైనా మార్పులు చేస్తారా? అనేది విడుదల తరువాతే తెలియనుంది.
Also read: Petrol price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ రేట్లు- కొత్త ధరలు ఇవే..
Also read: Disney plus hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook