2000 Notes Exchange At Post Office:
2023 మే నెలలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూ.2000 నోట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటికీ కూడా ఈ రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం ఉంది. తాజాగా దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో అప్‌డేట్ షేర్‌ చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ వద్ద ఉన్న రూ.2000 నోట్ల మార్పిడి కోసం పౌరుల‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. దేశంలోని ఆర్‌బీఐ కార్యాలయాలు, పోస్టాఫీసుల వ‌ద్ద తమ దగ్గర ఉన్న ఈ పెద్దనోట్లను మార్చుకోవ‌చ్చని తెలిపింది. నిన్నటి వరకు కేవలం ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను మార్చుకోగలిగే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో కూడా మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఇందుకు గడువును మాత్రం నిర్ణయించలేదని తెలుస్తోంది. తమ వెబ్‌సైట్‌లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్‌ క్వశ్చన్స్‌(FAQs) సెక్షన్ లో, ప్రజలు ఆర్‌బీఐ 19 ఇష్యూ ఆఫీస్‌లలో ఏదైనా పోస్టాఫీసు నుంచి రూ.2 వేల నోట్లను పంపవచ్చని తెలిపింది.


ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రూ.2000 నోట్లు మార్చుకునే పౌరులు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ల‌భిస్తున్న ద‌ర‌ఖాస్తు ని డౌన్లోడ్ చేసుకుని నింపి పోస్టాఫీసు ద్వారా ఆర్‌బీఐకి పంపవలసి ఉంటుంది.


ఇక ఈ నోట్లనే పోస్టాఫీసు ద్వారా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్నికి వస్తే..ముందుగా ప్రజలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్‌ ఫారమ్‌ను పూర్తిచేయాలి. ఆ తర్వాత తమ దగ్గర్లో ఉన్న ఏదైనా స్థానిక పోస్టాఫీసు నుంచి రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించాల్సి ఉంటుంది. ఎఫ్‌ఏక్యూలో సమాచారం ప్రకారం ఒక వ్యక్తి పోస్టాఫీసు బేస్డ్‌ ఫెసిలిటీలతో పాటు 19 ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు నోట్లను మార్చుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర కూడా రూ.2000 నోట్లు ఉంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి.


Also read: VV Vinayak: వైసీపీలో చేరనున్న వివి వినాయక్, కాకినాడ లేదా ఏలూరు నుంచి పోటీ


Also Read:  Washing Machine Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్‌ మీ 8.5 Kg Top Load వాషింగ్‌ మెషిన్‌.. 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter