Sensex దేశ ఆర్థిక ప్రగతి వేగంవంతం కావాలంటే డబ్బున్న వాళ్లు సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు కాని కొత్త సంస్థలు పుట్టుకొచ్చి వ్యాపారాలు చేయవు...అప్పుడు కాని ఉపాధి లభించి అటు ప్రజలకు, ట్యాక్సుల రూపంలో ఇటు ప్రభుత్వానికి ఆదాయం లభించదు. కాని షేర్ మార్కెట్ అంటేనే ఒడిదొడుకులు ఎప్పుడు లాభాల బాటపడుతుందో ఎప్పుడు కొంప ముంచుతుందో తెలియదు. గత నెల రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన పెరిగిపోయింది. ఈ కారణంగా స్టాక్ మార్కెట్ మరింత పతనమైంది. దీంతో ఏకంగా నెల రోజుల వ్యవధిలో రూ.28 లక్షల కోట్ల సంపదను ఆవిరై పోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెల రోజుల కిందట రూ.248.42 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్  పతనాల బాట పట్టి రూ.246.46 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఏప్రిల్‌ 11న రూ.275.11 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్‌ విలువ మే 11 నాటికి రూ.28 లక్షల కోట్లకు పడిపోయింది. ఇన్వెస్టర్లు చాలా రోజులుగా ఆచితూచిగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా మరో ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ కారణంగా 38 ఏళ్ల గరిష్ఠ స్థాయికి అమెరికాలో ద్రవ్యోల్బణం చేరుకుందని వివరిస్తున్నారు. ఇక మన దగ్గర కూడా 7-8 శాతం వరకు ఇన్‌ఫ్లేషన్‌ చేరుకోవడంతో ఆర్థిక మందగమనం కొనసాగుతోంది.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా పలు దేశాల్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వాలపై భారం పడుతోంది. ఈకారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోంది. ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దీంతో బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులకు అధిక వడ్డీ కట్టి కంపెనీలు నష్టపోతున్నారు. ఇలా మల్టీ నేషనల్ కంపెనీల లాభాలు తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లు స్టార్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు.


also read వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టిన బంగారం, పసిడి ధరలు.


also read BANK RULES ఇరవై లక్షలు దాటి నగదు జమ చేసిన , విత్ డ్రా చేసిన కొత్త రూల్స్ పాటించాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe