BANK RULES ఇరవై లక్షలు దాటి నగదు జమ చేసిన , విత్ డ్రా చేసిన కొత్త రూల్స్ పాటించాల్సిందే

Last Updated : May 12, 2022, 12:51 PM IST
  • డిపాజిట్ చేయాలన్నా లేక విత్ డ్రా చేయాలన్నా కొత్త నిబంధనలు
  • ప్యాన్, ఆధార్ కార్డు నంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది
  • ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి
BANK RULES  ఇరవై లక్షలు దాటి నగదు జమ చేసిన , విత్ డ్రా చేసిన కొత్త రూల్స్ పాటించాల్సిందే

BANK RULES రాను రాను కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్న బ్యాంకింక్ సిస్టమ్... నిబంధనలను కూడా అంతే పక్కాగా అమలు చేస్తోంది. ఎకనామిక్ బూమ్ వచ్చిన తర్వాత హవాలా వ్యాపారం గణనీయంగా పెరిగిపోవడంతో లెక్కల్లోకి రాని ఆదాయం భారీగా  చేతులు మారుతోంది. దీంతో మరిన్ని నిబంధనలు విధిస్తున్నాయి ఇండియన్ బ్యాంకులు. దీంతో ఈక్రమంలో మరో కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఇకపై ఎవరైనా బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.20 లక్షలు లేదా అంతకు డిపాజిట్ చేయాలన్నా లేక విత్ డ్రా చేయాలన్నా కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇకపై విత్ డ్రాయల్, డిపాజిట్ సమయంలో ప్యాన్, ఆధార్ కార్డు నంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి.

డిజిటల్ మనీ ట్రాన్స్‌ఫర్‌ను వాడకుండా ముఖ్యంగా అన్ని పనులకు నగదుపైనే ఆధారపడి పన్ను ఎగవేస్తున్న ఎగవేతదారులను కట్టడి చేసేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. నగదు వాడకాన్ని తగ్గించి... డిజిటల్ ట్రాన్‌జాక్షన్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రయివేట్, కోపఆపరేటివ్ బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల ద్వారా జరిగే లావాదేవీలకు కూడా ఇకపై పాన్, ఆధార్ వివరాలను ఇవ్వాల్సిన బాధ్యత కస్టమర్లపై ఉంటుంది. లేని ఎడల బ్యాంకింగ్ సేవలు అందే అవకాశం లేదు. వీలైనంత ఎక్కువ మందిని ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు ముఖ్యంగా బ్యాంకింగ్ పరిధిలో ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ఇకపై ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం నుంచి ప్రజలు తప్పించుకునే వీలుండదు. తద్వారా అటు ప్రభుత్వాలకు ఆదాయం ఇటు కస్టమర్లకు భద్రత కలగనున్నాయి.

also read  Bangladesh నిలకడగా పురోగమిస్తున్న బంగ్లాదేశ్... భారత్‌ను మించి తలసరి ఆదాయం నమోదు

also read Warranty- Guarantee Difference: గ్యారెంటీ, వారెంటీకి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News