Galaxy A73: స్మార్ట్​ఫోన్ల తయారీ దిగ్గజం శాంసంగ్​.. ఇటీవల విడుదల విడుదల చేసిన.. గెలాక్సీ ఏ73 5జీ ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్స్​ చేసుకునే వారికి కంపెనీ బంపర్ ఆఫర్​ ప్రకటించింది. మరి ఆ ఆఫర్ల వివరాలు ఏమిటి? ఫోన్ ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అందుబాటులో ఉన్న గెలాక్సీ ఏ72 మోడల్​కు కొనసాగింపుగా.. గెలాక్సీ ఏ 73 5జీ మొబైల్​ను గత నెలాఖరకున మార్కెట్లోకి విడుదల  చేసింది శాంసంగ్​. రెండు వేరియంట్లుగా దీనిని తీసుకొచ్చింది. అందులో 8జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.41,999గా నిర్ణయించింది.  8జీబీ ర్యామ్​+ 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను రూ.44,999గా ఉంది.


మూడు కలర్ వేరియంట్ ఆప్షన్స్​తో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. మింట్​, గ్రే, వైట్​ కలర్స్​లో ఈ స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చింది శాంసంగ్​.


శాంసంగ్​ గెలాక్సీ ఏ 73 5జీ ఫీచర్లు..


6.7 అంగుళాల డిస్​ప్లే ( సూపర్​ ఆమోల్డ్​ ఇన్ఫినిటి-ఓ-డిస్​ప్లే), 1080x2400 పిక్సెల్​ రెసొల్యూషన్​
120 హెచ్​జెడ్​ రీఫ్రెష్​ రెట్​తో కూడిన గొరిల్లా గ్లాస్​ 5 ప్రొటెక్షన్ డిస్​ప్లే
క్వాల్కమ్​ 778జీ ప్రాసెసర్​తో కూడిన.. అడ్రినో 642ఎల్​ జీపీయూ
వెనకవైపు 108 ఎంపీ కెమెరాతో కూడిన.. క్వాడ్ కెమెరా సెటప్​ (108 ఎంపీ+12 ఎంపీ+5ఎంపీ+5ఎంపీ)
32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 25 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​


అదిరే ఆఫర్లతో ప్రీ బుకింగ్స్​ షురూ..


గెలాక్సీ ఏ 73 5జీ కోసం ఇప్పటికే ప్రీ బుకింగ్ ప్రారంభించింది కంపెనీ. ముందస్తు బుకింగ్స్​ చేసుకునే కస్టమర్లకు అదిరే ఆఫర్లను ప్రకటించింది. ఫోన్​ ధరకు అదనంగా కేవలం రూ.రూ.499 చెల్లిస్తే.. రూ.6,990 విలువైన గెలాక్సీ బడ్స్​ సొంతం చేసుకోవచ్చని వివరించింది.


ఏప్రిల్ 8 సాయంత్రం ఆరు గంటల నుంచి శాంసంగ్ అధికారిక వెబ్​సైట్​లో స్పెషల్​ సేల్ నిర్వహించనున్నట్లు కూడా వెల్లడించింది కంపెనీ. ఈ ప్రత్యేక సేల్​లో శాంసంగ్​ ఫినాన్స్​ ప్లస్​, ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​, ఐసీఐసీఐ డెబిట్​, క్రెడిట్​ ద్వారా చెల్లింపులు జరిపితే రూ.3 వేల వరకు తక్షణ డిస్కౌంట్​ లభిస్తుందని పేర్కొంది.


Also read: Mobile Savings Days: స్మార్ట్​ఫోన్లపై అమెజాన్ సమ్మర్​ కూల్ ఆఫర్లు- పూర్తి వివరాలివే..


Also read: Stock Markets: మార్కెట్లకు రెండో రోజూ నష్టాలు- కుదిపేసిన ఐటీ, హెచ్​డీఎఫ్​సీ జంట షేర్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook