SAMSUNG GALAXY F41 price, features: 17 వేలకే 64 MP కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్
Samsung Galaxy F41 smartphone in India: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ శ్రేణిలో భారతదేశంలో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41. ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000 mah బ్యాటరీ, 64 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Samsung Galaxy F41 pricing, availability, sale offers | గెలాక్సీ ఎఫ్ 41 ధర, లభ్యత, ఆఫర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy F41 smartphone in India: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ శ్రేణిలో భారతదేశంలో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41. ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000 mah బ్యాటరీ, 64 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. డిస్‌ప్లే విషయానికొస్తే, గెలాక్సీ ఎఫ్ 41లో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకారం మాడ్యూల్‌లో స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ ఉంది.
Samsung Galaxy F41 pricing, availability, sale offers | గెలాక్సీ ఎఫ్ 41 ధర, లభ్యత, ఆఫర్స్ వివరాలు:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .16,999 కాగా 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .17,999 గా ఉంది. అక్టోబర్ 16న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ( Flipkart Big Billion Days ) అమ్మకం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 స్మార్ట్‌ఫోన్ ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ, ఫ్యూజన్ బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. Also read : Jobs, Salary increments: వాళ్ల ఉద్యోగాలకు ఢోకా లేదట.. జీతాలు కూడా పెరుగుతాయి..
లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా అక్టోబర్ 16న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 స్మార్ట్‌ఫోన్ రూ .15,499 ప్రారంభ ధరకే లభించనుండం మరో విశేషం. అంతేకాదండోయ్.. దీనిపై మరో ఆఫర్ కూడా ఉంది. మీరు మీ ఎస్బిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్టయితే, అదనంగా మరో 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
Galaxy F41 specifications | శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4-అంగుళాల పూర్తి-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్ ఉంది. ఆండ్రాయిడ్ 10 వెర్షన్, ఎక్సినోస్ 9611 చిప్‌సెట్ ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. 6 GB ర్యామ్ + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న గెలాక్సీ ఎఫ్ 41 ఫోన్‌లో మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో 512 GB వరకు మెమొరీ ఎక్స్‌పాండ్ చేసుకునే వీలుంది. Also read : SBI offers on loans: కరోనా కాలంలో రుణాలపై ఎస్బీఐ ఆఫర్స్
స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా ఫోటోగ్రఫీ కోసం మరింత ఉపయోగపడనుంది. ఇందులో 64 ఎంపి ప్రైమరీ సెన్సార్, 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 ఎంపి లెన్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం అంతా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది కనుక సెల్ఫీలు బాగా రావడం కోసం ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 32 ఎంపి ఫ్రంట్ కెమెరాను అమర్చారు. గెలాక్సీ ఎఫ్ 41 మొబైల్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Also read : Bank Holidays in October 2020: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe