SBI Phishing Scam: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 'ఫిషింగ్ స్కామ్' పట్ల కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఇటీవలి కాలంలో కొన్ని ఫేక్ కాల్స్‌ ద్వారా కస్టమర్ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు ఎస్‌బీఐ గుర్తించింది. రెండు ఫోన్ నంబర్ల ద్వారా ఈ స్కామ్ జరుగుతున్నట్లు గుర్తించిన ఎస్‌బీఐ.. వాటి నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయొద్దని కస్టమర్లకు సూచించింది. అలాగే, ఆ ఫోన్ నంబర్స్ ద్వారా వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట అసోం సీఐడీ అధికారులు ఈ స్కామ్‌ను గుర్తించారు. +91-8294710946, +91-7362951973 నంబర్ల నుంచి ఎస్‌బీఐ కస్టమర్లకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. తాము బ్యాంకు ప్రతినిధులమని చెప్పి... కేవైసీ అప్‌డేట్ కోసం ఆ నంబర్ల నుంచి వచ్చే లింకులపై క్లిక్ చేయమని చెబుతున్నట్లు గుర్తించారు. కస్టమర్స్ అది నిజమేనని నమ్మి... ఆ లింకులపై క్లిక్ చేస్తే... కస్టమర్ల కీలక సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అసోం సీఐడీ ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఎస్‌బీఐ కస్టమర్లను అలర్ట్ చేసింది. అదే ట్వీట్‌ను ఎస్‌బీఐ రీట్వీట్ చేస్తూ ఆ ఫోన్ నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకోవద్దని కస్టమర్లకు సూచించింది.


ఫిషింగ్ స్కామ్ అంటే :


ఫిషింగ్ స్కామ్ అంటే.. సైబర్ నేరగాళ్లు తాము చట్టబద్దమైన సంస్థలకు చెందిన ప్రతినిధులుగా ఆయా కంపెనీల కస్టమర్లను నమ్మిస్తారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఫేక్ ఫోన్ కాల్స్, మెయిల్స్‌ను ఆయుధంగా వాడుకుంటారు. వాళ్లు పంపించే లింకులపై క్లిక్ చేశారో ఇక అంతే. కస్టమర్ల కీలక డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది.


మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారనో... లేక మీ ఫోన్ నంబర్‌కి లగ్జరీ కారు గిఫ్ట్‌గా వచ్చిందనో.. అప్పుడప్పుడు మెసేజ్‌లు రావడం చూసి ఉంటాం. ఇవి కూడా ఫిషింగ్ స్కామ్ లాంటివే. ఇలాంటి ఆఫర్‌తో మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్స్ వస్తే... వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడం మంచిది. 



Also Read: Vijay Babu Rape Case: హీరో విజయ్ పై రేప్ కేసు నమోదు.. విజయ్ కోసం పోలీసుల గాలింపు!


Also Read: Cm Kcr Plenary: టీఆర్ఎస్‌కు తెలంగాణ పెట్టని కోట: సీఎం కేసీఆర్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.