Cm Kcr Plenary: టీఆర్ఎస్‌కు తెలంగాణ పెట్టని కోట: సీఎం కేసీఆర్

Cm Kcr Plenary: టీఆర్ఎస్‌ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు..తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్లీనరీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటని..ఎవ్వరూ కూడా బద్దలు కొట్టని కోట అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 01:45 PM IST
  • హైటెక్స్‌లో ఘనంగా టీఆర్ఎస్‌ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు
  • ప్లీనరీలో 11 అంశాలపై తీర్మానం
  • టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట-సీఎం కేసీఆర్
Cm Kcr Plenary: టీఆర్ఎస్‌కు తెలంగాణ పెట్టని కోట: సీఎం కేసీఆర్

Cm Kcr Plenary: టీఆర్ఎస్‌ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు..తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్లీనరీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటని..ఎవ్వరూ కూడా బద్దలు కొట్టని కోట అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని చెప్పారు. 60 లక్షల మంది పార్టీ శ్రేణులతో..వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు. దేశంలో పది అత్యుత్తమ గ్రామాల్లో తెలంగాణవేనని చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. అవార్డు..రివార్డు రాని తెలంగాణ డిపార్ట్‌మెంట్‌ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు..అవమానాలు ఎదుర్కొన్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణలో పాలన సాగిస్తున్నామని తెలిపారు.

కేంద్రం, పలు సంస్థల నుంచి వస్తున్న అవార్దులే రాష్ట్ర ప్రగతికి చిహ్నమన్నారు సీఎం కేసీఆర్‌. పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసుకుంటే మరింత సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. అవినీతి రహితంగా..చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. అంకితభావంతో పనిచేసినందుకే తెలంగాణలో ఇవాళ విద్యుత్‌ సమస్య లేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ధరణి ద్వారా రైతులు, భూ యజమానుల సమస్య పూర్తిగా తీరిందన్నారు. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామన్నారు సీఎం కేసీఆర్‌. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,000 కోట్లు ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రంగా తెలంగాణను నిలిపామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నామని చెప్పారు. ఒకప్పుడు 3 ప్రభుత్వ వైద్యశాలలుంటే ఇప్పుడు 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. తాజాగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. ఉద్యోగ సాధన కోసం నిరుద్యోగులంతా తలమునకలుగా కష్టపడుతున్నారని ప్రశంసించారు.

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం వేదికగా 13 తీర్మానాలను ప్రవేశపెట్టారు.

1. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం

2. దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో తెరాస పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం

3. ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం

4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్​లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

5. భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం

6. బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

7. తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

8. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్​ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్​లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం

9. నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం

10. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం

11. తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

12. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం

13. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం

Also Read: Cm Ys Jagan: 2024 ఎన్నికలకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన సీఎం వైఎస్ జగన్

Also Read: AP Inter hall Tickets 2022: ఏపీ ఇంటర్ హాల్ టిక్కెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News