Vijay Babu Rape Case: హీరో విజయ్ పై రేప్ కేసు నమోదు.. విజయ్ కోసం పోలీసుల గాలింపు!

Vijay Babu Rape Case: ప్రముఖ నటుడు విజయ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ కేరళ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మలయాళ సినీ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 01:31 PM IST
Vijay Babu Rape Case: హీరో విజయ్ పై రేప్ కేసు నమోదు.. విజయ్ కోసం పోలీసుల గాలింపు!

Vijay Babu Rape Case: చిత్ర పరిశ్రమ నుంచి నిత్యం ఏదో వార్త గురించి చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు అలాంటి ఓ వార్త  ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, నిర్మాత విజయ్ బాబుపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అవకాశం ఇప్పిస్తానంటూ ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేరళలోని కోజీకోడ్ లో కేసు నమోదయ్యింది. దీంతో చిత్ర సీమలో నటీనటులు, వారి అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

మలయాళ చిత్ర పరిశ్రమలో విజయ్ బాబుకు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మంచి గుర్తింపు ఉంది. అయితే ఇతనిపై ప్రస్తుతం ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేస్తోంది. కేరళలోని కోజికోడ్ పోలీస్ స్టేషన్ లో విజయ్ బాబుపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ విజయ్ బాబు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని అందులో పేర్కొంది. ఇప్పుడీ వార్త మలయాళ చిత్ర సీమను కలవరానికి గురిచేసింది. 

అయితే ఏప్రిల్ 22న విజయ్ బాబుపై ఓ మహిళ ఫిర్యాదు చేసినా.. ఇంతవరకు అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు నమోదు చేసి 5 రోజులు గడిచినా విజయ్ బాబును విచారించకోవడంపై ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కేసులోని వివరాలను పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు ఈ ఫిర్యాదుపై వివరణ అడిగేందుకు విజయ్ బాబు ఆచూకీ పోలీసులకు కనిపించడం లేదని తెలుస్తోంది.  

Also Read: Major Movie Release Date: 'మేజర్' మూవీ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే!

Also Read: Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News