ఆదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఆ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న ఎస్బీఐ..ఆ కంపెనీకు ఇచ్చిన రుణాలపై స్పష్టత వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్బీఐ త్రైమాసిక ఫలితాల విడుదల నేపధ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల వివరాలు వెల్లడించారు. అదానీ గ్రూప్‌కు ఇచ్చిన ఫిజికల్ ఎస్సెట్, క్యాష్ ఫ్లోను దృష్టిలో ఉంచుకుని రుణాలిచ్చినట్టు ఎస్బీఐ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ కంపెనీలకు దాదాపు 27 వేల కోట్లు రుణాలిచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది. బ్యాంకులిచ్చిన మొత్తం రుణాల్లో ఇది 0.88 శాతంగా ఉంది. అదానీ గ్రూప్ షేర్లలో క్షీణతతో ఏర్పడిన అనిశ్చితి నేపధ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ఈ వివరాలు వెల్లడించారు. అదానీ గ్రూప్ షేర్లను దృష్టిలో ఉంచుకుని ఇవ్వలేదని తెలిపారు. 


ఫిజికల్ ఎస్సెట్స్, క్యాష్ ఫ్లో ప్రకారమే


హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తరువాత అదానీ గ్రూప్‌కు అత్యధికంగా ఎస్బీఐ రుణాలిచ్చిందనే చర్చ ప్రారంభమైంది. ఎస్బీఐ త్రైమాసిక ఫలితాల ప్రకటనతో అదానీ గ్రూప్ ప్రాజెక్టుకు రుణాలిచ్చేటప్పుడు అదానీ గ్రూప్ ఫిజికల్ ఆస్థులు, క్యాష్ ఫ్లో పరిగణలో తీసుకున్నాని తెలిపింది. ఈ గ్రూప్ వాటా తమ మొత్తం రుణాల్లో 0.88 శాతం ఉంది. అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల వసూలులో సవాళ్లు ఎదురయ్యే విషయంలో ఎస్బీఐ స్పష్టత ఇవ్వలేదు. 


తాము అదానీ గ్రూప్ షేర్లను పరిగణలో తీసుకుని రుణాలు మంజూరు చేయలేదని ఎస్బీఐ తెలిపింది. తమకు ఆ విధమైన పోర్ట్ ఫోలియో కూడా లేదని వెల్లడించింది. ఆర్ధిక లావాదేవీలకై ఏ గ్యారంటీ ఇవ్వలేదంది. బ్యాంకు ఆర్ధిక పరిస్థితిని ఆందోళనకు నెట్టే చర్యలు చేపట్టలేదని ఎస్బీఐ తెలిపింది. ఈ పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాలపై సమాధానమిచ్చారు. 


ఈక్విటీ లేకుండా డబ్బులు విడుదల కావని..ఈక్విటీ కోసం నిరీక్షించడం లేదని ఎస్బీఐ వెల్లడించింది. అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనం నేపధ్యంలో రుణాలిచ్చిన సంస్థలపై ప్రభావం పడనుందనే అనుమానాల నేపధ్యంలో ఎస్బీఐ వివరణ ఇచ్చింది. 


Also read: Gautam Adani: కొనసాగుతున్న అదానీ గ్రూప్ పతనం, బిలియనీర్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook