SBI Doorstep Banking Service: కోవిడ్19 మహమ్మారి కారణంగా బ్యాంకింగ్ సహాలు పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఇంటి నుంచి కాలు పెట్టాలంటే కొందరు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచే తమ పని పూర్తయ్యే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలను తీసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వం రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన ఖాతాదారుల కోసం పికప్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఇతరత్రా సర్వీసులు లాంటి మూడు రకాల సేవల్ని ఇంటివద్దే అందిస్తోంది. చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్స్, కొత్త చెక్కు స్లిప్స్, ఐటీ చలాన్ లాంటి పికప్ సర్వీసులు కల్పిస్తోంది. డ్రాఫ్ట్స్, పే ఆర్డర్స్, టర్మ్ డిపాజిట్ రిసీప్ట్స్, అకౌంట్ స్టేట్‌మెంట్, టీడీఎస్ లేదా ఫామ్ 16 సర్టిఫికెట్ మరియు గిఫ్ట్ కార్డ్ లాంటి డెలివరీ సర్వీసులు ఉన్నాయి. నగదు ఉపసంహరణ, పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లాంటి ఇతరత్రా సేవల్ని కరోనా నేపథ్యంలో తమ ఖాతాదారుల కోసం తీసుకొచ్చింది.


Also Read: SBI Home Loan Interest: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా, ఎంచక్కా SBI Onlineలో పొందవచ్చు


ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు (SBI doorstep banking Features)
1. State Bank Of India హోం బ్రాంచ్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
2. హోమ్ బ్రాంచ్ వద్ద డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. 
3. రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి, నగదు డిపాజిట్ పరిమితిని రూ.20,000కు పరిమితం చేశారు.
4. నగదు సంబంధించి లావాదేవిలకు రూ.100 మరియు అదనంగా జీఎస్టీ చెల్లించాలి. నగదు రహిత లావాదేవిల నిమిత్తం రూ.60 మరియు జీఎస్టీ చెల్లించాలి
5. పాస్‌బుక్‌తో చెక్కులు లేదా విత్‌డ్రాయల్ ఫామ్ ద్వారా నగదు ఉపసంహరణను అనుమతిస్తారు.


Also Read: SBI Customers Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యం, ఏ ఛార్జీలు వసూలు చేయరు


70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్, అంగవైకల్యం ఉన్నవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ ఉన్నవారికి, కేవైసీ పూర్తి చేసుకున్న బ్యాంక్ ఖాతాదారులకు, అకౌంట్‌కు సరైన మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నవారికి, సింగిల్ అకౌంట్ ఉన్నవారు, జాయింట్ అకౌంట్ ఉండి ఇందులో ప్రస్తుతం ఒక్క ఖాతాదారుడు ఉన్నవారికి మాత్రమే ఈ సర్వీసులు అందిస్తుంది. మైనర్ల అకౌంట్స్, హోం బ్రాంచ్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో అడ్రస్‌లో నివాసం ఉన్నవారికి ఈ సేవలు వర్తించవు.


డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్ రిజిస్ట్రేషన్ విధానం (Doorstep Banking App Registration Process):
Step 1: డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 2: రిజిస్ట్రేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ నమోదు చేయాలి
Step 3: సిస్టమ్ నుంచి మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది
Step 4: ఆ ఓటీపీని డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌లో నమోదు చేయండి
Step 5: మీ పేరు, ఈమెయిల్ (ఆప్షనల్) పాస్‌వర్డ్ (PIN) మరియు టైప్ చేసి టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను యాక్సెప్ట్ చేస్తే కన్ఫామ్ అవుతుంది
Step 6: రిజిస్ట్రేషన్ పూర్తయితే డీఎస్‌బీ సిస్టమ్ నుంచి మీకు వెల్‌కమ్ ఎస్‌ఎంఎస్ వస్తుంది
Step 7: రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పిన్ నెంబర్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వాలి
Step 8: యాడ్ అడ్రస్ ఆప్షన్ తీసుకుని అందులో మీ చిరునామా నమోదు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ చిరునామాలు పొందుపరిచే అవకాశం ఉంది. ఈ అడ్రస్‌లను యాడ్ చేసుకోవడం లేదా డిలీట్ చేసే వీలు కల్పించింది.  ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్‌లను మొబైల్ యాప్, వెబ్‌సైట్ మరియు కాల్ సెంబర్ ద్వారా వినియోగించుకోవచ్చునని ఎస్‌బీఐ తెలిపింది.


Also Read: State Bank Of India: ఎస్‌బీఐ ఉద్యోగులకు బ్యాంకింగ్ దిగ్గజం శుభవార్త, వారికి బోనస్‌గా 15 రోజుల జీతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook