SBI FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు
SBI FD Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టేవారికి 50 బేసిస్ పాయింట్స్ అధికంగా వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది.
SBI FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ మొత్తంలో డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టేవారికి 50 బేసిస్ పాయింట్స్ అధికంగా వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది. ఇంకా చెప్పాలంటే రూ. 2 కోట్లు లేదా ఆ పై మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేసే వారికి ఈ గుడ్ న్యూస్ వర్తిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం మే నెల 10వ తేదీ నుంచి.. అంటే నేటి నుంచే పెంచిన కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
7 రోజుల నుంచి 45 రోజుల గడువు కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌కి ఈ పెంచిన వడ్డీ రేట్లు వర్తించవు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. 46 రోజుల నుంచి 149 రోజుల గడువు కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌కి 50 బేసిస్ పాయింట్స్ ఈ వడ్డీ రేట్లు వర్తించనుండగా.. 1 ఏడాది నుండి రెండేళ్ల గడువు కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌కి 40 బేసిస్ పాయింట్స్ వడ్డీ పెంచినట్టు ఎస్బీఐ పేర్కొంది. అలాగే రెండు నుండి మూడేళ్ల కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కి 65 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
వడ్డీ రేట్ల పెంపు అనంతరం కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి - వడ్డీ రేట్లు
7-45 రోజులు కాల పరిమితి - 3 %
46 - 179 రోజులు - 3.5%
180 - 210 రోజులు - 3.5%
211 రోజుల నుండి 1 ఏడాది - 3.73%
1 ఏడాది నుండి 2 ఏళ్లు - 4%
2 ఏళ్ల నుండి 3 ఏళ్లు - 4.25%
3 ఏళ్ల నుండి 5 ఏళ్లు - 4.5%
5 ఏళ్ల నుండి 10 ఏళ్లు - 4.5%
ఇదిలావుంటే, కొత్త నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజెన్స్‌కి అన్ని రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై (Fixed Deposits Interest Rates) 50 బేసిస్ పాయింట్స్ అధికంగా వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది.
Also read : How to Reduce Electricity Bill In Summers: కరెంటు బిల్లు నుంచి విముక్తి పొందేందుకు ఈ పని చేయండి
Also read : Wheat Prices Hiked: ఆకాశాన్నంటుతున్న గోధుమ ధరలు.. కారణం ఏంటంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook