SBI FD rates: ఎస్బీఐ గుడ్ న్యూస్- ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు!
SBI FD rates: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
SBI FD rates: దేశీయ అతిపెద్ద, ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు లేదా 0.10 శాతం వరకు పెంచుతున్నట్లు (SBI FD rates Hiked) ప్రకటించిది.
సవరించింది ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయని ఎస్బీఐ శనివారం ఓ ప్రకటనలో (SBI hikes FD rates) పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచే (15 జనవరి 2022) అమలులోకి రానున్నాయని స్పష్టం (SBI new FD rates) చేసింది.
ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లు (సాధారణ ఖాతాదారులకు) ఇలా..
7 నుంచి 45 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2.9 శాతంగా ఉంచింది ఎస్బీఐ.
46 నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 3.9 శాతంగా నిర్ణయించింది.
180 నుంచి 210 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.4 శాతంగా నిర్ణయించినట్లు ఎస్బీఐ ప్రకటించింది.
211 రోజుల నుంచి ఏడాది లోపు వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4.4 వద్ద స్థిరంగా ఉంచింది ఎస్బీఐ.
ఇక ఏడాది నుంచి రెండేళ్ల లోపు వ్యవది గల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.1 శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఇది 5 శాతం వద్ద ఉండేది.
రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటును 5.1 శాతంగా ఉంచింది.
మూడు నుంచి ఐదేళ్ల లోపు వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.3 శాతం వద్ద ఉంది.
ఐదు నుంచి పదేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటును 5.4 శాతం వద్ద ఉంచింది ఎస్బీఐ.
సీనియర్ సిటిజన్లకు ఇలా..
7 నుంచి 45 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 3.4 శాతంగా ఉంచింది ఎస్బీఐ. ఇంతకు ముందు కూడా 3.4 శాతం వద్దే ఉండటం గమనార్హం.
46 నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4.4 శాతంగా నిర్ణయించింది.
180 నుంచి 210 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.9 శాతంగా నిర్ణయించినట్లు ఎస్బీఐ ప్రకటించింది.
211 రోజుల నుంచి ఏడాది లోపు వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4.9 వద్ద స్థిరంగా ఉంచింది ఎస్బీఐ.
ఇక ఏడాది నుంచి రెండేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.6 శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఇది 5.5 శాతం వద్ద ఉండేది.
రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేటును 5.8 శాతంగా ఉంచింది.
మూడు నుంచి ఐదేళ్ల లోపు వ్యవ్యధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.8 శాతం వద్ద, ఐదు నుంచి పదేళ్ల లోపు వ్యవధి గల ఎఫ్డీలపై వడ్డీ రేటును 6.2 శాతం వద్ద ఉంచింది ఎస్బీఐ.
Also read: Todays Gold Price: సంక్రాంతి వేళ..దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు
Also read: December WPI Inflation: డిసెంబర్లో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం- తొమ్మిదో నెలా రెండంకెలపైనే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook