ICICI Minimum Balance : నేటికాలంలో ప్రతీఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ కామన్ అయ్యింది. చిన్న ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి రైతులు, పెన్షన్ పొందే వ్రుద్ధులు, విద్యార్థులు, ఉపాధిహామీ పనుల్లో పనిచేస్తున్న కూలీలకు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతు్నాయి. బ్యాంకు అకౌంట్ లేని వారు కూడా ఏదొక బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను తీసుకుంటారు. తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని అందులో పొదుపుచేసుకునేవారు బ్యాంకుల్లో కొత్త సేవింగ్స్ ఖాతాలను కూడా తీసుకుంటారు. తమ అవసరాల కోసం బ్యాంకు అకౌంట్ ను తీసుకునే ముందు ప్రతి బ్యాంకు మీకు తప్పనిసరిగా కనీస బ్యాలెన్స్ కొంత మొత్తాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే మీరు జరిమానా కట్టాల్సి ఉంటుంది. కానీ కొన్ని సార్లు మన అవసరాలకు కూడా డబ్బు లేని సమయంలో వీటిని పరిగణలోనికి తీసుకోకుండా జీరో బ్యాలెన్స్ తో ముగుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గత ఐదేండ్ల వ్యవధిలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు వినియోగదారుల నుంచి రూ 8,495కోట్లను వసూలు చేశాయి. ఇదంతా కూడా పెనాల్టీ రూపంలోనే వచ్చింది. దీనికి సంబంధించి కొన్నాళ్లక్రితం గణాంకాలు కూడా వచ్చాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్బీఐ గతంలో ఇలా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పాటించకుంటే ఛార్జీలు విధిస్తుండేది. కొంతకాలం క్రితం ఈ బ్యాంకును నిబంధనను ఎత్తేసింది. జీరో బ్యాలెన్స్ ఉన్నాకూడా ఎలాంటి ఛార్జీలు వసూలు  చేయడంలేదు. అయితే ఇతర బ్యాంకులు మాత్రం పెనాల్టీలు వసూలు చేస్తున్నాయి. 


గత ఐదేండ్లలో వినియోగదారులు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేదన్న కారణంతో వారి నుంచి రూ. 1538 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ బ్యాంక్ రూ.  1466 కోట్లు , బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 1251కోట్లు, కెనరా బ్యాంకు రూ. 1158 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బ్యాంకు సేవలను బట్టి వాటిలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలన్నది బ్యాంకులు నిర్ణయిస్తుంటాయి. వీటిపై కస్టమర్లకు కచ్చితంగా సమాచారం అందించాలి. నెలకు యావరేజ్ గా ఎంత బ్యాలెన్స్ ఉండాలన్న ప్రాతిపదికన దీనిని నిర్ణయిస్తుంటాయి.  


Also Read : Ola Shares: మార్కెట్లో జెట్ స్పీడ్‎తో దూసుకెళ్తున్న ఓలా..వరుసగా రెండోరోజు 20శాతం పెరిగిన షేరు..!!


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా2020 నుంచి మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను వసూలు చేయడం లేదు. హెడ్డీ ఎఫ్సీ సేవింగ్స్ ఖాతాల్లో మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ. 10వేలు పెనాల్టీ విధిస్తుంది. కనీసం ఏడాదికి రూ. లక్ష ఎఫ్డీ చేయాలి. సేబీ అర్బన్ ప్రాంతాల్లో అకౌంట్లో కనీసం రూ. 5వేలు లేదా రూ. 50వేలు ఫిక్స్డ్ డిపాజిట్ మెయింటెన్ చేయాలి. మినిమమ్ కంటే తక్కువగా ఉంటే 6శాతం లేదంటే రూ. 600 ఫైన్ విధిస్తుంది. 


ఇక ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో లో కనీసం రూ. 5 వేలు ఉండాలి. ఛార్జీ రూ. 100 కు అదనంగా, నెలకు యావరేజ్ బ్యాలెన్స్‌ కంటే ఎంత తక్కువ ఉంటుందో అందులో 5 శాతం పెనాల్టీ విధిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూరల్‌లో కనీసం రూ. 500, సెబీ అర్బన్ లోని బ్యాంక్ అకౌంట్లో రూ. 1000, అర్బన్, మెట్రో అకౌంట్లలో రూ. 2 వేలు మినిమమ్ ఉండాలి. ఇక్కడ ఛార్జీలు వరుసగా రూ. 400, రూ. 500, రూ. 600 గా ఉంది.అటు యెస్ బ్యాంకులో కనీస బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉన్నా..తక్కువగా ఉన్నా..షార్ట్ ఫాల్ నగదులో దాదాపు 5 శాతం వరకు ఛార్జీ విధిస్తుంది. 


Also Read : Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook