SBI Interest Rates: దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడా బ్యాంకు కస్టమర్లకు ఝలకు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్లను పెంచేసింది. ఈ రేట్ల పెంపు ఇప్పటికే అమలులోకి వచ్చేసింది. సెప్టెంబరు 15 నుంచి కొత్త రేట్లు అమలు చేసినట్లు బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఎస్‌బీఐ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును కూడా పెంచినట్లు  SBI స్పష్టం చేసింది. గతంలో ఈ రేటు 14.85 శాతంగా ఉండేది. అయితే ఈ రేటు ఇప్పుడు 14.95 శాతానికి పెరిగింది. అలాగే బ్యాంకు లేటెస్ట్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేట్లు ఎలా ఉన్నయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (MCLR) కన్నా బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వవు. అయితే MCLR ను కనిష్ట రుణ రేటుగా బ్యాంకులు చెప్పుకొస్తాయి. ఇప్పుడా రుణ రేటు 8 శాతం నుంచి గరిష్టంగా 8.75 శాతం వరకు ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంకు ఆప్ ఇండియాలో మాత్రం ఓవర్ నైట్ MCLR 8 శాతంగా ఉంది. నెల నుంచి మూడు నెలల లోపు MCLR రేటు 8.15 శాతం గా ఉండగా.. ఆరు నెలల రేటు 8.45 శాతం, ఏడాదికి 8.55 శాతంగా కొనసాగుతుంది. 


అయితే బ్యాంకులు అన్నీ ప్రతి ఏడాదీ MCLR రేటును ప్రాతిపదికంగా రుణాలు జారీ చేస్తాయి. అందువల్ల ఈ MCLR రేటు పెరిగితే రుణాలపై వడ్డీపై ప్రభావం పడుతుంది. ఈ MCLR రేటు రెండేళ్లకు 8.65 శాతం.. మూడేళ్లకు 8.75 గా ఉంది. మరోవైపు SBI ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ రుణ రేటు (EBLR) మాత్రం స్ధిరంగా కొనసాగుతుంది. అది ప్రస్తుతం 9.15 శాతం వద్ద కొనసాగుతుంది. 


Also Read: Reasons Behind IND VS BAN Match Defeat: బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి వీళ్లే కారణమా ?


స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) బేస్ రేటు 10.10 శాతంగా ఉంది. ఈ ఏడాది జూన్ 15 నుంచి రుణాలపై ఈ రేటు వర్తిస్తుంది. ఇక SBI బెంచ్ మార్క్ ప్రైమ్ రుణ రేటు (BPLR) 14.95 శాతంగా ఉంది. ఇది సెప్టెంబరు 15 నుంచి అమలులోకి వచ్చింది. 


BPLRను 2003 నుంచి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమలులోకి తీసుకొచ్చింది. కస్టమర్ల నుంచి బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు ఇదే. హోమ్ లోన్స్‌కు వడ్డీ రేట్ల నిర్ణయానికి BPLRను వినియోగిస్తారు. రుణాలు తీసుకునే సగటు నిధుల వ్యయం ఆధారంగా BPLR రేటును నిర్ణయిస్తారు. అయితే బ్యాంకులు ఎప్పటికప్పుడు రుణ రేట్లను సవరిస్తూ ఉంటాయి.


Also Read: CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook