New Cash Withdrawal Rules: ఏటీఎం సెంటర్లలో కొత్త రూల్స్ వస్తున్నాయి. ఇంతకుముందులా కార్డు పెట్టి సులభంగా డబ్బులు తీసుకోలేరు. ఎస్బీఐ ఇప్పటికే అమలు చేస్తున్న ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్స్ రానున్నాయి..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్ పద్ధతిని ఏటీఎంలలో ప్రవేశపెట్టింది. ఏటీఎంలలో పెరిగిపోతున్న అక్రమ లావాదేవీలు, మోసాల్ని నివారించేందుకు ఎస్బీఐ ఈ పద్ధతి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ ఒక్కటే ఈ పద్ధతి అమలు చేస్తోంది. త్వరలో మిగిలిన బ్యాంకులు కూడా ఇదే పద్ధతి అమలు చేయనున్నాయి. అంటే ఇంతకుముందుగా సులభంగా కార్డు పెట్టి డబ్బులు తీయలేరు. ఇదంతా కస్టమర్ల సెక్యూరిటీ కోసమే. అంటే అక్రమ లావాదేవీలు జరగకుండా నియంత్రించే క్రమంలో అదనపు రక్షణ ఇది.


ఎస్బీఐ కస్టమర్లైతే ప్రస్తుతం ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేసే సమయంలో నాలుగంకెల ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఆ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు హోల్డర్ ఉన్నారో..ఆ వ్యక్తి రిజస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఒకసారికే పనిచేస్తుంది. రెండవసారి విత్‌డ్రా చేయాలంటే మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఈ పద్ధతిని ఎస్బీఐ జనవరి నుంచే అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి ఎస్బీఐ కూడా పదివేలు దాటిన క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు మాత్రమే ఈ ఓటీపీ విధానం అమలు చేస్తోంది. త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నాయి.


ఓటీపీ ఎలా ఎంటర్ చేయాలి


క్యాష్ విత్‌డ్రా చేసేటప్పుడు సంబంధిత వ్యక్తి వద్ద డెబిట్ కార్డుతో పాటు రిజిస్టర్డ్ నెంబర్ మొబైల్ కూడా వెంట ఉండాలి. డెబిట్ కార్డు ఏటీఎంలో పెట్టి..పిన్ ఎంటర్ చేసి..కావల్సిన నగదు కోరిన తరువాత ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది కాబట్టి నెట్ అవసరం లేదు. మొబైల్ నెంబర్‌కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీ...ఏటీఎంలో ఎంటర్ చేసిన తరువాతే..మీరు కోరిన క్యాష్ విత్‌డ్రా అవుతుంది. 


Also read: Domino vs Swiggy-Zomato: డొమినో పిజ్జా ఇకపై స్విగ్గీ-జొమాటోల్లో ఆర్డర్ చేయలేరు, ఎందుకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.