SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్- గడువులోపు అ పనిని పూర్తి చేయకుంటే నిలిచిపోనున్న సేవలు!
ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ యూజర్లకు అలర్ట్. ఇంకా ఎవరైనా ఖాతాదారులు ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయకుంటే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని అలర్ట్ చేసింది.
SBI Alert: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ యూజర్లకు అలర్ట్. ఇంకా ఎవరైనా ఖాతాదారులు ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయకుంటే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని అలర్ట్ చేసింది.
గడువులోపు ఆధార్‌తో పాన్ లింక్ పూర్తవకుంటే.. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవల్లో సమస్యలు రావచ్చని తెలిపింది. ఆధార్-పాన్ లింక్‌కు మార్చి 31 తుది గడువుగా స్పష్టం చేసింది బ్యాంక్.
నిజానికి గత ఏడాది సెప్టెంబర్ 30తో ఆధార్ పాన్ అనుసంధానానికి గడువు ముగియాల్సి ఉంది. అయితే కరోనా సంక్షోభం వల్ల ఈ గడువును మార్చి 31 వరకు పెంచింది ప్రభుత్వం.
ఆధార్-పాన్ లింక్ ఎలా చేయాలి?
ముందుగా ఇన్కం ట్యాక్స్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి https://www.incometaxindiaefiling.gov.in/home
హోం పేజీలో లింక్ 'Link Aadhaar' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.. దీనితో మరో పేజీ ఓపెన్ అవుతుంది.
కొత్త పేజీలో మీ పాన్, ఆధార్ వివరాలను వాటిల్లో ఉన్నట్లుగా నింపాలి
మీ ఆధార్‌పై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే.. have only year of birth in aadhaar card ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేయడం లేదా ఓటీపీ ఆప్షన్‌ను ద్వారా వివరాలను వెరిఫై చేయాలి
వెరిఫికేషన్ పూర్తయ్యాక.. పాన్-ఆధార్ లింక్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చేయాలంటే..
UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి మళ్లీ స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
567678 లేదా 56161 నంబర్కుపై విధంగా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఆధార్-పాన్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
Also read: SBI charges: ఎస్బీఐ ఐఎంపీఎస్ లిమిట్ పెంపు- కొత్త పరిమితి, ఛార్జీలు ఇవే..
Also read: LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook