SBI charges: ఎస్​బీఐ ఐఎంపీఎస్​ లిమిట్​ పెంపు- కొత్త పరిమితి, ఛార్జీలు ఇవే..

SBI charges: దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్​బీఐ వినియోగదారులకు అలర్ట్​. ఐఎంపీఎస్​ లావాదేవీల ఛార్జీల్లో స్వల్ప మార్పులు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 08:18 PM IST
  • ఐఎంపీఎస్ సేవలపై ఎస్​బీఐ కీలక నిర్ణయం
  • లావాదేవీ పరిమితి పెంచుతూ ప్రకటన
  • ఛార్జీల్లోనూ స్వల్ప మార్పులు చేసిన బ్యాంక్​
SBI charges: ఎస్​బీఐ ఐఎంపీఎస్​ లిమిట్​ పెంపు- కొత్త పరిమితి, ఛార్జీలు ఇవే..

SBI charges: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ ఐఎంపీఎస్ (ఇమీడియట్​ పేమెంట్ సర్వీస్​) సేవలకు విధించే ఛార్జీల్లో స్వల్ప మార్పులు చేసింది. బ్యాంక్ తాజా నిర్ఱయం ప్రకారం.. తక్షణమే (ఫిబ్రవరి 1) ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

పరిమితి పెంపు..

ఐఎంపీఎస్​ ద్వారా లావాదేవీల పరిమితి కూడా పెంచింది ఎస్​బీఐ. ఇప్పటి వరకు ఐఎంపీఎస్ ద్వారా రూ.2 లభల వరకు ట్రాన్స్​ఫర్ చేసుకునేందుకు వీలుంటగా.. ఇకపై ఆ పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది. ఆన్​లైన్​తో పాటు ఆఫ్​లైన్​లోనూ ఈ లావాదేవీలు జరిపేందుకు వీలుంది. 

ఐఎంపీఎస్ ఛార్జీలు ఇలా..

ఆఫ్​లైన్ మోడ్​ ద్వారా చేసే ఐఎంపీఎస్​ లావాదేవీలకు మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అంటే ఎవరైనా ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్లి ఈ సేవలను వినియోగించుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

రూ.1000 వరకు చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు.

రూ.1000  దాటి.. రూ.10 వేల వరకు చేసే లావాదేవీలకు రూ.2+ జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది.

రూ.10,000 దాటి.. రూ.1,00,000 వరరకు చేసే లావాదేవీలకు రూ.4+జీఎస్​టీ వర్తిస్తుంది.

రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మధ్య జరిపే లావాదేవీలకు రూ.12+జీఎస్​టీ ఛార్జీగా నిర్ణయించింది ఎస్​బీఐ.

(రూ.1000 నుంచి రూ.లక్ష వరకు ఇంతకు ముందు కూడా ఇవే ఛార్జీలు ఉండటం గమనార్హం.)

రూ.2 లక్షలు దాటి.. రూ.5 లక్షల వరకు జరిపే లావాదేవీలకు రూ.20 ఛార్జీ వసూలు చేయనుంది ఎస్​బీఐ. దీనికి జీఎస్​టీ అదనం.

Also read: LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ

Also read: Economic Survey 2022: ఆటోమొబైల్ రంగానికి చిప్​ల దెబ్బ: ఆర్థిక సర్వే 2022

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News