Advantages of buying Second Hand Car in India: కారు కొనడం చాలా మందికి ఓ కల. అయితే బడ్జెట్ లేని కారణంగా కొత్త కారు కొనడం అందరికీ సాధ్యం కాదు. ప్రస్తుత రోజుల్లో మీరు నాలుగు లేదా ఐదు లక్షల రూపాయల కంటే తక్కువ ధరతో భారతీయ మార్కెట్లో కారు కొనలేరు. మీ బడ్జెట్ ఎక్కువగా లేకుంటే.. సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి మీకు నచ్చిన కారును కొనుగోలు చేయొచ్చు. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ద్వారా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నాలుగు ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రయోజనాలను బహుశా ఇదివరకు ఎవరూ చెప్పి ఉండకపోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. మనం కొత్త కారుని కొనుగోలు చేసినప్పుడు మొదటి కొన్ని రోజులు తక్కువ వేగంతో నడపమని కార్ల తయారీదారు సలహా ఇస్తారు. కానీ సెకండ్ హ్యాండ్ కారుతో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు కారు కొన్న రోజు నుంచి అధిక వేగంతో ప్రయాణించొచ్చు.


2. కొత్త కారు కొన్న కొద్ది రోజుల పాటు వాహనంపై గీతలు పడతాయని మీరు భయపడుతారు. మొదటి స్క్రాచ్ పడినప్పుడు మీరు చాలా  బాధపడతారు. అయితే పాత కారుతో మీకు ఈ కష్టాలు ఉండవు. చాలా మంది స్క్రాచ్ టెన్షన్‌ను అస్సలు ఫీల్ అవ్వరు.


3. మీరు పాత కారు కొంటే రోడ్ టాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడే ఆ యజమాని వివిధ పన్నులు చెల్లించి ఉంటాడు. 


4. మీరు తక్కువ బడ్జెట్‌లో కూడా ఎక్కువ ఫీచర్స్ ఉన్న కారుని సొంతం చేసుకుంటారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో రూ.3 నుంచి 4 లక్షలకు గొప్ప ఫీచర్లు ఉన్న వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ బడ్జెట్‌లో మీరు ప్రాథమిక కారును మాత్రమే పొందగలుగుతారు.


Also Read: Pooja Hegde Thigh Pics: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే.. స‌మ్మ‌ర్‌లో హీటు పెంచేస్తోన్న బుట్టబొమ్మ!  


Also Read: Pavitra Lokesh: నరేష్ నా పార్టనర్ మాత్రమే కాదు.. పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.