Stock Market today: ఒమిక్రాన్ భయాలున్నా స్టాక్ మార్కెట్ల జోరు- సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్
Stock Market News: కరోనా కొత్త వేరియంట్ భయాలు ఉన్నా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్లో సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు పెరిగాయి.
Stock Market Updates: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ (గురువారం) లాభాలతో (Stocks closing bell) ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 776 పాయింట్లు పెరిగి.. 58,461 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి-నిఫ్టీ (NSE Nify) 235 పాయింట్ల లాభంతో 17,401 వద్ద స్థిరపడింది.
ఒమిక్రాన్ భయాలు ఉన్నా సూచీలు ఆధ్యంతం జోరు కొనసాగించాయి. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందంచాయి. ఐటీ, ఆర్థిక షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 58,513 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 57,680 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,420 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,149 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్లలో 13 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. 17 కంంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.
హెచ్డీఎఫ్సీ 3.87 శాతం, పవర్‌గ్రిడ్ 3.79 శాతం, సన్ ఫార్మా 3.11 శాతం, టాటా స్టీల్ 2.90 శాతం, బజాజ్ ఆటో 2.56 శాతం లాభాలను గడిచాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ 0.62 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.45 శాతం నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ రెండు కంపెనీలు మాత్రమే నష్టాలను నమోదు చేశాయి. మిగతా 28 షేర్లు సానుకూలంగా స్పందించడం గమనార్హం.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్ (దక్షిణ కొరియా), హాంకాంగ్, థైవాన్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. షాంఘై (చైనా), టోక్యో (జపాన్) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
కాస్త పెరిగిన రూపాయి..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 09 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.99 వద్ద కొనసాగుతోంది.
Also read: Smart TV Discount Offer: భలే మంచి చౌక బేరం.. అమెజాన్ లో రూ.6,999లకే స్మార్ట్ LED టీవీ!
Also read: HDFC Bank FD rates: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు పెంపు- కొత్త వడ్డీ రేట్లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook