SBI Share Price: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి అవకాశమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్టాక్ విలువ భారీగా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్‌పై నిశిత పరిశీలన, అవగాహన ఉంటే అద్భుతమైన రిటర్న్స్ సాధించవచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఇప్పుడు మంచి అవకాశముందని..ఓ సంస్థ షేర్ విలువ క్రమంగా పెరగనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.


షేర్ మార్కెట్‌లో ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ 23 శాతం వరకూ పెరగవచ్చని అంచనా. ఈ స్టాక్ విలువ 532.95 రూపాయలపై ట్రేడ్ అవుతోంది. బ్యాంకు రుణాల్లో వృద్ధి, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడటంతో ఎస్బీఐ షేర్ మరింతగా పెరగవచ్చని అంచనా. ఎస్బీఐ షేర్ విషయంలో ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీలు కూడా అంచనాలు పెట్టుకున్నాయి. ఎస్బీఐ టార్గెట్ ధరను 620 నుంచి 650 వరకూ పెట్టాయి. ఎస్బీఐ షేర్ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 13.20 శాతం పెరిగింది. గత నెలరోజుల్లో ఈ షేర్ దాదాపుగా 1 శాతం పడిపోయింది. బ్యాంకు రుణాలు పెరగడం, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడటంతో లిక్విడిటీ డిమాండ్ ఉంటుంది. ఫలితంగా ఎస్బీఐ షేర్ విలువ పెరగనుంది. 


ఎస్బీఐ మార్కెట్ క్యాప్ 4.75 కోట్లుగా ఉంది. కొద్దికాలం క్రితం 5 కోట్ల మార్కెట్ క్యాప్‌కు చేరుకుంది. 5 కోట్ల క్లబ్‌లో చేరిన దేశంలోని మూడవ బ్యాంక్ ఇది. ఇప్పటికే హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆరు నెలల క్రితం ఛార్ట్ పరిశీలిస్తే..ఎస్బీఐ షేర్ ఏప్రిల్ 4 న 513 కోట్ల స్థాయిపై ఉంది. 6 నెలల్లో కంపెనీ షేర్ కేవలం 3 శాతం అంటే 19 రూపాయలు పెరిగింది. గత ఐదేళ్లలో కంపెనీ షేర్ 107.79 రూపాయలు పెరిగింది. 


23 ఏళ్లలో రిటర్న్ ఎంత


1999 జనవరి 1న ఎస్బీఐ స్టాక్ 15 రూపాయలుంది. గత 23 ఏళ్లలో షేర్ ఇన్వెస్టర్లకు 3,431 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈ సమయంలో కంపెనీ షేర్ 517.21 రూపాయలు పెరిగింది.


Also read: Multibagger Stocks: 14 వేల పెట్టుబడి..21 ఏళ్లలో కోటి రూపాయలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook