Share Market: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్ అనేవి అంతులేని లాభాల్ని ఆర్జించి పెడుతుంటాయి. దీర్ఘకాలంలో భారీ లాభాల్ని ఆర్జిస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా . చెప్పులు తయారు చేసే కంపెనీ షేర్ అమాంతం పెరిగి లాభాలు కురిపిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1999 నవంబర్ 12వ తేదీన రిలాక్సో కంపెనీ ఒక షేర్ ధర 1.46 రూపాయలు కాగా ఇప్పుడది పెరిగి ఏకంగా 1,021.35 రూపాయలకు చేరుకుంది. రిలాక్సో ఫుట్‌వేర్స్ లిమిటెడ్ షేర్ నిన్న బీఎస్ఈపై 1,021.35 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. షేర్ మార్కెట్‌లో ఎగుడు దిగుడు సాధారణమే. కొన్ని షేర్ కంపెనీలు ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు అందిస్తుంటాయి. షేర్ మార్కెట్‌లో లిస్టైన రిలాక్సో కంపెనీ ఇండియాకు చెందిన అతిపెద్ద ఫుట్‌వేర్ కంపెనీ. ఇది ఇన్వెస్చర్లకు భారీ లాభం ఇస్తోంది. 


2 రూపాయల్నించి 1,021 రూపాయలకు


రిలాక్సో కంపెనీ షేర్ విలువ 1999 నవంబర్ 12వ తేదీన కేవలం 1.46 రూపాయలుంది. ఇదిప్పుడు 1,021.35 రూపాయలకు చేరుకుంది. రిలాక్సో ఫుట్‌వేర్స్ లిమిటెడ్ షేర్ మొన్న 1,021.35 రూపాయలకు ట్రేడ్ అయింది. గత 23 ఏళ్లలో ఈ కంపెనీ షేర్ ఇన్వెస్టర్లకు 69,855.48 శాతం లాభాల్ని అందించింది.


ఇక ఈ కంపెనీ రిటర్న్స్ గురించి చెప్పుకుంటే..గత మూడేళ్లలో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 108.27 శాతం భారీ లాభాల్ని అందించింది. గత 5 ఏళ్లలో కంపెనీ 294.53 శాతం రిటర్న్స్ ఇచ్చింది. కానీ గత ఏడాదికాలంలో కంపెనీ స్టాక్ 15.9 శాతం తగ్గింది. 


రిలాక్సో ఫుట్‌వేర్ కంపెనీ 1984లో స్థాపితమైంది. ఆ తరువాత 3 బోనస్ షేర్లు ప్రకటించింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు కోట్లాది రూపాయలు లాభం కలిగింది.  2000 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన ఈ కంపెనీ 1-1 నిష్పత్తిలో బోనస్ షేర్ చేసింది. ఆ తరువాత అదే నిష్పత్తిలో 2 బోనస్ షేర్లు ఇచ్చింది. రెండవ బోనస్ షేర్ ప్రకటన 2015 జూలై 1న, చివరిది జూన్ 26, 2019న జరిగింది. రిలాక్సో కంపెనీలో ప్రారంభంలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇప్పుడది 7 కోట్లుగా మారుండేది. 


రిలాక్సో ఫుట్‌వేర్ లిమిటెడ్ కంపెనీ ఇండియాకు చెందిన మల్టీ నేషనల్ పుట్‌వేర్ కంపెనీ. ఈ కంపెనీ పరిమాణం ప్రకారం ఇండియాలో అతిపెద్దది. ఉత్పాదనలో రెండవది. ఈ కంపెనీ క్యాప్ విలువ 25,424.06 కోట్ల రూపాయలుగా ఉంది.


Also read: LIC New Childrens Money Back Policy: పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పథకం, 150 రూపాయలతో లక్షాధికారి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook