LIC New Childrens Money Back Policy: పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పథకం, 150 రూపాయలతో లక్షాధికారి

LIC New Childrens Money Back Policy: మీ పిల్లలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే..భవిష్యత్ సురక్షితంగా ఉంచాలనుకుంటే ఎల్ఐసీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. కొత్తగా న్యూ చిల్డ్రన్స్ మనీబ్యాక్ పాలసీ ప్రారంభించింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2022, 06:10 PM IST
LIC New Childrens Money Back Policy: పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పథకం, 150 రూపాయలతో లక్షాధికారి

LIC New Childrens Money Back Policy: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సేవింగ్స్, పెట్టుబడి అనేవి చాలా ముఖ్యం. జనానికి కూడా వీటి ప్రాధాన్యత తెలిసింది. పిల్లల భవిష్యత్ కోసం ఇప్పట్నించే తల్లిదండ్రులు వివిధ రకాల ప్లాన్స్ చేస్తుంటారు. మీ సంపాదనలో కొద్దిభాగం పొదుపు చేస్తే..మీ పిల్లల భవిష్యత్ బాగుంటుంది. అందుకే ఎల్ఐసీ అందిస్తోంది సరికొత్త పథకం..

ఎల్ఐసీ సరికొత్త స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ పేరు న్యూ చిల్డ్రన్స్ మనీబ్యాక్ పాలసీ. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లల భవిష్యత్ సంరక్షించుకోవచ్చు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి మీ పిల్లలకు మంచి బహుమతిగా మారుతుంది. 

న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ

మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఇవాళ ఎల్ఐసీ కొత్తగా ప్రారంభించిన న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ తీసుకోండి. చిన్నమొత్తంలో సేవింగ్స్ చేస్తూ భవిష్యత్తులో పిల్లల్ని లక్షాధికారిగా చేయవచ్చు. రోజుకు 150 రూపాయలు పొదుపు చేస్తే చాలు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ 25 ఏళ్లకు ఉంటుంది. దాంతోపాటు ఇందులో మెచ్యూరిటీ మొత్తం వాయిదాల్లో లభిస్తుంది. మీ పిల్లవాడు 18 ఏళ్లకు చేరుకున్నప్పుడు తొలి వాయిదా లభిస్తుంది. రెండవ వాయిదా 20 ఏళ్ల వయస్సులో, మూడవ వాయిదా 22 ఏళ్ల వయస్సులో అందుతుంది. 

న్యూ చిల్డ్రన్స్ మనీబ్యాక్ పాలసీలో పాలసీదారుడికి మనీ బ్యాక్ ట్యాక్స్ కూపంలో 20 శాతం లభిస్తుంది. దాంతోపాటు మీ పిల్లవాడికి 25 ఏళ్లు నిండినప్పుడు మొత్తం డబ్బులు చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం మొత్తంతో పాటు బోనస్ కూడా లభిస్తుంది. ఇలా ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పిల్లల భవిష్యత్ బాగుంటుంది. 

ఈ భీమాలో ఏడాది వాయిదా 55 వేల రూపాయలుంది. 25 ఏళ్లలో మొత్తం 14 లక్షల రూపాయలవుతుంది. మెచ్యుూరిటీ పూర్తయ్యాక 19 లక్షల రూపాయలు లభిస్తాయి. పాలసీదారుడు బతికుంటేనే ఈ మొత్తం లభిస్తుంది. ఒకవేళ వెనక్కి తీసుకోవాలనుకుంటే..మొత్తం డబ్బులు వడ్డీతో సహా మెచ్యూరిటీ పూర్తయ్యాక లభిస్తుంది. 

పాలసీ తీసుకునేందుకు వయస్సు 0 నుంచి 12 ఏళ్ల వరకూ ఉండవచ్చు. 60 శాతం పాలసీ డబ్బులు వాయిదాల్లో 40 శాతం మెచ్యూరిటీ పూర్తయ్యాక బోనస్ తో పాటు లభిస్తుంది. ఈ పధకంలో భాగంగా కనీసం 1 లక్ష రూపాయలు భీమా తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. వాయిదా డబ్బులు తీసుకోకపోతే వడ్డీతో సహా ఒకేసారి మొత్తం డబ్బులు లభిస్తాయి. 

ఈ పాలసీ తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డు పాన్‌కార్డ్, అడ్రస్ ప్రూప్ అవసరమౌతాయి. పాలసీదారుడి మెడికల్ ఫిట్నెస్ అవసరం. పాలసీ తీసుకునేందుకు ఏదైనా ఎల్ఐసీ బ్రాంచిలో ఫామ్ నింపాల్సి ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే..భీమా చేసిన వాయిదాలో 105 శాతం చెల్లిస్తారు. 

Also read: LIC Policies Revival: మీ పాత ఎల్ఐసీ పాలసీలను ఇలా పునరుద్ధరించుకోండి, జరిమానాపై రాయితీ కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News