Share Market Updates 14th july 2022: హైదరాబాద్: తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలను చవి చూశాయి. మొదట్లో లాభాలతో పరుగెత్తిన మార్కెట్ మిడ్ సెషన్లో భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇన్వెస్టర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో మార్కెట్ నష్టాల వైపు మొగ్గు చూపింది. రూపాయి బలహీనతతో పాటు అమెరికా ద్రవ్యోల్బణం 41 ఏళ్ళ గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్లను కలవర పెట్టింది. వరుసగా నాలుగో రోజు నష్టాలను చవి చూసిన మార్కెట్ మధ్యాహ్నం తరువాత కోలుకొని స్వల్ప నష్టాలతో ముగిసింది. 53,688 పాయింట్లతో ప్రారంభం అయిన మార్కెట్ చివరికి 98 పాయింట్లు నష్ట పోయి 53416 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
 
అదానీ ట్రాన్స్‌మిషన్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, రెడ్డీస్ ల్యాబొరెటరీస్, కొటక్ మహీంద్రా, మారుతీ సుజుకి, పేటియం షేర్లు లాభపడగా.. జొమాటో, ఎల్ అండ్ టి, బ్యాంకు అఫ్ బరోడా, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. ఐటి సెక్టార్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి బలహీన మార్జిన్లు ప్రకటించే అవకాశం ఉండడంతో ఐటీ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. విప్రో 1.29 శాతం, హెచ్‌సీఎల్  1.61 శాతం, టెక్ మహీంద్రా 1.44 శాతం, టీసీఎస్ 1 శాతం నష్టపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూపాయితో డాలర్ మారకం విలువ వరుసగా పతనం అవుతూ వచ్చింది. 79 రూపాయల వద్ద ఆల్ టైం కనిష్ఠానికి చేరింది. అమెరికా ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తప్పదన్న ఐఎంఎఫ్ అంచనాలతో ఇన్వెస్టర్లు సైతం ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.


Also Read : NPS Account: ఎన్‌పిఎస్ ఎక్కౌంట్‌లో పెట్టుబడితో..నెలకు 45 వేల పెన్షన్..ఎలాగంటే


Also Read : ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ కొనే వారికి గుడ్‌న్యూస్.. పండుగ సీజన్ కంటే ముందే ధరలు తగ్గబోతున్నాయి!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook