NPS Account: మీ కుటుంబంలో ఒకరి పేరుపై ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే..నెలకు 44 వేల రూపాయలు సంపాదించవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెడితే ఇదే మంచి అవకాశం. మంచి పథకం కూడా.
ప్రతి ఒక్కరూ భవిష్యత్ కోసం ఏదో ఒక మంచి విధానంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఆ మార్గం సురక్షితమైందే కాకుండా..ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేదిగా ఉండాలి. పెట్టుబడి పెట్టడం వల్ల మరో లాభం కూడా ఉంది. కష్టకాలంలో కచ్చితంగా ఉపయోగపడుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా లేదా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురైనా ఉపయోగపడుతుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయి. మీ భార్యపేరుపై నేషనల్ పెన్షన్ ప్రారంభిస్తే..అందులో పెట్టిన పెట్టుబడి మొత్తం మీ భార్యకు 60 ఏళ్లు పూర్తయ్యాక లభిస్తాయి. దాంతోపాటు ప్రతి నెలా పెన్షన్ రూపంలో రెగ్యులర్ ఆదాయం కూడా సమకూరుతుంది. ఎన్‌పిఎస్ ఎక్కౌంట్ తెరిచే ముందు ప్రతి నెలా పెన్షన్ ఎంతకావాలో నిర్ణయించుకోవాలి. అలా చేయడం వల్ల మీ భార్యకు 60 ఏళ్లు నిండిన తరువాత ఏ విధమైన డబ్బులు సమస్య రాదు. ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఒక దీర్ఘ కాలిక వ్యవధికి సంబంధించిన పెట్టుబడి ప్లాన్. 2004 జనవరిలో ప్రభుత్వ సిబ్బంది కోసం ఈ స్కీమ్ ప్రారంభించారు. తరువాత డిమాండ్ మేరకు 2009లో అన్ని కేటగరీలకు వర్తింపజేశారు. ఎవరైనా వ్యక్తి వర్కింగ్ లైఫ్ సందర్భంగా పెన్షన్ ఎక్కౌంట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. జమ అయిన డబ్బులో ఒక భాగాన్ని ఒకేసారి డ్రా చేసుకునే సౌలభ్యముంటుంది. మిగిలిన డబ్బుల్ని పదవీ విరమణ తరువాత నిర్ణీత పెన్షన్ కోసం కేటాయించవచ్చు. ఇందులో ప్రతి నెలా లేదా ప్రతి యేటా డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు ప్రతి నెలా 1000 రూపాయలతో ఎన్‌పిఎస్ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. 60 ఏళ్ల వయస్సులో ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ మెచ్యూర్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం 60 ఏళ్ల వయస్సు దాటిన తరువాత కూడా ఎన్‌పిఎస్ ఎక్కౌంట్ కొనసాగించవచ్చు. ఉదాహరణకు మీ భార్య వయస్సు 30 ఏళ్లున్నప్పుడు ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే..అందులో ప్రతి నెలా 5 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి. ఈ మొత్తంపై ఏడాదికి పది శాతం రిటర్న్ లభిస్తుంది. అంటే 60 ఏళ్ల వయస్సులో మొత్తం 1.13 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఇందులో 40 శాతం అంటే దాదాపు 45 లక్షల రూపాయలు ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన డబ్బులు నెలకు 45 వేల రూపాయల పెన్షన్‌గా తీసుకోవచ్చు.
Also read: ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ కొనే వారికి గుడ్‌న్యూస్.. పండుగ సీజన్ కంటే ముందే ధరలు తగ్గబోతున్నాయి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook