UCO Bank: కస్టమర్లకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన యూకో బ్యాంక్
యూకో బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకు నుండి తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వలన ఇప్పటి వరకు తీసుకున్న లోన్లపై మరియు కొత్తగా తీసుకోనున్న లోన్ ఈఎంఐ రేట్లు పెరగనున్నాయి.
UCO Bank: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన యూకో బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇకపై నెలవారీ ఈఎంఐలు ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు. బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే లోన్ తీసుకున్నవారితో పాటు కొత్తగా రుణాలు తీసుకునేవారిపై అదనపు భారం పడనుంది.
యూకో బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ట్రెజరీ బిల్ లింక్డ్ లెండింగ్ రేట్లను కూడా పెంచేసింది. ఈ రెండు రుణ రేట్లు 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచేసింది. అలాగే అన్ని రకాల మెచ్యూరిటీ టెన్యూర్లకు ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, రెపో రేటు, బేస్ రేటు, బీపీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేట్లు మాత్రం స్థిరంగానే ఉంచింది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వు రేషియో (ఐసీఆర్ఆర్) దశలవారీ ఎత్తివేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే యూకో బ్యాంక్ ఇప్పుడు రుణ రేట్లు పెంచడం గమనార్హం. ఎంసీఎల్ఆర్ పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. అంటే సెప్టెంబర్ 10 నుంచే ఈ వడ్డీ రేట్ల పెంపు అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ఎంసీఎల్ఆర్ అనేది కనిష్ఠ రుణ రేటుగా పరిగణిస్తాయి బ్యాంకులు. అంటే ఈ రేటుకు తక్కువగా కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదు.
యూకో బ్యాంక్ లేటెస్ట్ ఎంసీఎల్ఆర్, టీబీఎల్ఆర్ రేట్లు..
1) ప్రస్తుతం యూకో బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.9 శాతం నుంచి 7.95 శాతానికి పెరిగింది.
2) నెల రోజుల ఎంసీఎల్ఆర్ రుణ రేటు 8.1 శాతం నుంచి 8.15 శాతానికి పెంచింది.
3) మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.25 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది.
4) ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతం నుంచి 8.55 శాతానికి పెరిగింది.
5) ఏడాది ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉండగా అది 8.70 శాతానికి పెరిగింది.
6) టీబీఎల్ఆర్ 3 నెలల టెన్యూర్‌పై 6.8 శాతానికి పెంచింది.
7) ఆరు నెలల టెన్యూర్ గల టీబీఎల్ఆర్ రేటు 6.95 శాతానికి చేరింది.
8) ఏడాది టెన్యూర్ గల టీబీఎల్ఆర్ వడ్డీ రేటు 7 శాతానికి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook