SBI Credit Card Rules: ఈ మధ్య కాలంలో అన్ని బ్యాంక్ లు కూడా ఇబ్బడి ముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తున్నాయి. కాస్త ఎలిజిబిలిటీ ఉన్న వారికి కూడా ఎంతో కొంత లిమిట్ తో క్రెడిట్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్‌ లు తమ ఉద్యోగస్తులకు టార్గెట్ ఇస్తున్న కారణంగా కొందరు పెద్దగా ఎలిజిబిలిటీ లేకున్నా కూడా క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తున్నారు. కొద్దిపాటి జీతం వచ్చే ఉద్యోగం చేసే వారికి కూడా ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రెడిట్ కార్డులను తీసుకుని ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చాలా మంది ఉన్నారు. దాన్ని సరిగ్గా మెయింటెన్‌ చేస్తే పర్వాలేదు కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం కచ్చితం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. వాటిని తెలుసుకోకుండా కార్డు వాడితే భారీ నష్టం తప్పదు. 


ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వెబ్‌ సైట్‌ ప్రకారం ఏయూఆర్‌యూఏం కార్డుదారులకు ఇంతకు ముందు వచ్చినట్లుగా ఆర్‌బీఎల్‌ లుక్స్ కూపన్ లు రావడం లేదు. గతంలో ఏడాదికి రూ.5 లక్షలు వినియోగించిన వారికి ఈ కూపన్‌ లు వచ్చేవి. ఏయూఆర్‌యూఎం కార్డులు కలిగి ఉన్న వారు ఈజీ డిన్న ప్రైమ్ మరియు లెన్స్ కార్డ్‌ గోల్డ్‌ మెంబర్ షిప్ ఇతర బెనిఫిట్స్ అందవు. 


ఆన్ లైన్‌ రెంట్‌ పేమెంట్‌ చేసేవారికి గతంలో 5ఎక్స్ రివార్డ్‌ పాయింట్లు లభించేవి. కానీ ఇకపై వారికి 1ఎక్స్ రివార్డు పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఎస్‌బీఐ వారు ఇచ్చిన సింప్లీ క్లిక్‌, సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే వినియోగిస్తారు. 


Also Read: Urfi Javed Pics : ఉర్పీ వింత డ్రెస్సు.. చర్మం మొత్తం ఎర్రగా అయిందట!.. అయినా తగ్గేదేలే


లెన్స్ కార్ట్‌ లో ఆన్ లైన్ కొనుగోలు చేస్తే ఇచ్చే రివార్డ్‌ ను కూడా ఎస్బీఐ తగ్గించింది. కొన్ని కార్డుల వారికి మాత్రమే ఆఫర్‌ వస్తుంది. 10ఎక్స్ రివార్డ్‌ పాయింట్లను కాకుండా 5 ఎక్స్ రివార్డ్‌ పాయింట్లను మాత్రమే ఎస్‌బీఐ ప్రస్తుతం ఇస్తుంది. ఇంకా అపోలో, బుక్ మై షో, క్లియర్ ట్రిప్‌, నెట్‌ మెడ్స్‌ వంటి ఆన్ లైన్ పేమెంట్స్ లో కూడా గతంలో 10 ఎక్స్ రివార్డ్‌ పాయింట్స్ లభించేవి. 


కానీ ఇప్పుడు అక్కడ కొనుగోలు లో ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. ఎస్‌ బీ ఐ క్రెడిట్ కార్డును ఉపయోగించే వారు తప్పనిసరిగా ఈ మార్పులు గమనించాలి. లేదంటే గతంలో మాదిరిగానే ఆఫర్స్‌ ఉన్నాయని కొనుగోళ్లు చేస్తే.. డబ్బు ఖర్చు పెడితే భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. ముందు ముందు మళ్లీ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్‌బీఐ ఏమైనా కొత్త పతకాలను తీసుకు వస్తుందేమో చూడాలి.


Also Read: PBKS Vs MI Dream 11 Team Prediction: పంజాబ్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ.. ట్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్ మీకోసం..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి