PBKS Vs MI Dream11 Prediction Today Fantasy Tips: పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈ సీజన్లో 46వ మ్యాచ్ జరగనుంది. ముంబై ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించగా.. నాలుగింటిలో ఓడిపోయింది. అటు పంజాబ్ 9 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ముంబై ఉండగా.. పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్లాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం అని చెప్పొచ్చు. పంజాబ్ సొంత మైదానం మొహాలీలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ ఎలా ఉండబోతుంది..? తుది జట్టులో ఎవరు ఉంటారు..? హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
పిచ్ రిపోర్ట్ ఇలా..
మొహాలీ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. ఈ సీజన్లో జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 153 నుంచి 191 పరుగుల మధ్య ఉంది. నాలుగో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 257 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఐపీఎల్ 2023లో ఈ స్టేడియంలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మరోసారి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.
హెడ్ టు హెడ్ రికార్టులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పంజాబ్ 15 మ్యాచ్‌లు గెలవగా.. ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పంజాబ్, ముంబై జట్ల మధ్య మరోసారి ఉత్కంఠభరిత పోరు జరిగే అవకాశం ఉంది. సొంతగడ్డపై పంజాబ్ జట్టుకు కాస్త విజయ అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ముంబైను తక్కువ అంచనా వేయలేం.
తుది జట్లు ఇలా.. (అంచనా)
పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ టెడ్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహర్ వధేరా, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్.
డ్రీమ్ 11 టీమ్ ఇలా.. (PBKS vs MI Dream11 Prediction Today Match)
కీపర్ - ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్ - శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్
ఆల్ రౌండర్లు - సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, కామెరూన్ గ్రీన్, సామ్ కర్రాన్
బౌలర్లు - పీయూష్ చావ్లా, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్
Also Read: AP Govt: ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్.. సిట్ విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి