Todays Gold Rate: బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల కన్పిస్తోంది. ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు, డాలర్ విలువ, మార్కెట్ డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల ఆధారంగా బంగారం ధర ప్రతిరోజూ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. పదిరోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర..కొద్దిరోజుల్నించి స్వల్పంగా పెరుగుతోంది. ఇవాళ భారీగా పెరగడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. దేశవ్యాప్తంగా పది గ్రాముల బంగారంపై ఏకంగా 370 రూపాయల వరకూ పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ఇవాళ్టి ధరలు(Gold Price) పరిశీలిద్దాం.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Delhi Gold Rate)10 గ్రాముల ధర 47 వేల 400 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 710 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల150 రూపాయలు కాగా..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 150 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 380 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 500గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 400 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల100 రూపాయలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 250 రూపాయలైతే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 360 రూపాయలుంది.


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఊహించినట్టే బెంగళూరుతో సమానంగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం(Hyderabad Gold Rate)పది గ్రాముల ధర 45 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 360 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 250 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 360 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర పలుకుతోంది.


Also read: BMW iX, Audi e-Tron ఎలక్ట్రిక్ కార్లు ఇక ఇండియాలో...ధర ఎంతంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook