Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీరేటు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ఇవాళ మరోసారి బంగారం ధరలు(Gold Rate)స్వల్పంగా తగ్గాయి. వివిధ నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Delhi Gold Rate)10 గ్రాముల ధర 47 వేల 850 రూపాయలుంగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 2 వందలుగా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 680 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 680 రూపాయలుంది. ఇక తమిళనాడు చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 120 కాగా..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 220 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 700 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల700 కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 940 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 120 రూపాయలుంది.


ఇక హైదరాబాద్‌లో(Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 7 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 700 రూపాయలుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుంది. విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. ఢిల్లీ, చెన్నైలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే బంగారం ధర తగ్గువగా ఉంది. 


Also read: IPPB Alert: ఖాతాదారులకు ఐపీపీబీ షాక్​- వచ్చే ఏడాది నుంచి ఛార్జీల బాదుడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook