Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర
Gold Price Today: పసిడి ప్రియులకు మరోసారి ఊరటనిచ్చే అంశం. బంగారం ధర మరోసారి తగ్గింది. వరుసగా మూడవరోజు బంగారం ధర తగ్గడంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Price Today: పసిడి ప్రియులకు మరోసారి ఊరటనిచ్చే అంశం. బంగారం ధర మరోసారి తగ్గింది. వరుసగా మూడవరోజు బంగారం ధర తగ్గడంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. వివిధ ప్రాంతాల మధ్య భౌగోళిక ఘర్షణలు, ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంకుల వద్ద ఉండే బంగారం నిల్వలు, వడ్డీ రేటు, జ్యూవెల్లరీ మార్కెట్ పరిస్థితి, డాలర్ విలువ వంటివి ప్రధాన కారణాలుగా ఉంటుంటాయి. బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. దేశంలో బంగారం ధరలు వరుసగా మూడవరోజు తగ్గుముఖం పట్టాయి. దేశంలో పది గ్రాముల బంగారం ధరపై 190 రూపాయల వరకూ తగ్గింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 270 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 120 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 210 రూపాయలు కాగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 150 రూపాయలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 260 రూపాయలుంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 3 వందలైతే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 850 రూపాయలైతే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 930గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Price) ఒకేలా ఉన్నాయి. దేశంలోని ఇతర నగరాల కంటే తక్కువగా బెంగళూరు ధరలకు సమానంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం(Hyderabad Gold Price) పది గ్రామలు ధర 44 వేల 850 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 930 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 850 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 930 రూపాయలుంది. ఇక విజయవాడలో కూడా ఇదే ధర పలుకుతోంది.
Also read: Twitter CEO Jack Dorsey: సీఈఓ జాక్ డోర్సీ నుంచి CTO Parag Agrawal కి సీఈఓ బాధ్యతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook