Gold Price Today: బులియన్ మార్కెట్‌లో మరోసారి బంగారం ధర పెరుగుతోంది. మొన్నటి వరకూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలో మళ్లీ మార్పు వస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర, డాలర్ విలువ, భౌగోళిక పరిస్థితులు, కేంద్ర రిజర్వ్ బ్యాంక్‌లో బంగారం నిల్వ, వడ్డీ రేటు వంటివి బంగారం ధరల్లో మార్పులకు కారణమవుతుంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గత కొద్దికాలంగా స్వల్ప తగ్గుదల నమోదైన బంగారంలో ఇప్పుడు మళ్లీ పెరుగుదల కన్పిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Gold Price)10 గ్రాముల ధర 47 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 550గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 790 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 790 రూపాయలుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 380 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 500 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 250 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 950 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల100 అయితే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 950 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 200గా ఉంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. తెలంగామ రాజధాని హైదరాబాద్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 2 వందలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సైతం అదే ధర కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా నగరాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే బంగారం ధర తక్కువగా ఉంటుంది. అయితే 24 క్యారెట్ల బంగారం విషయంలో మాత్రం ముంబైలోనే అతి తక్కువ ధర ఉంటోంది. 


Also read: Crazy Offer: రూ.20,990 ధర గల Oppo Mass 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,000కే.. త్వరపడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి