Best SIP Plans: ఎస్ఐపీలో వందల్లో పెట్టుబడులు..లక్షల్లో లాభాలు, ఎలాగో తెలుసుకోండి
Best SIP Plans: పెట్టుబడులు పెట్టేందుకు లేదా సేవింగ్స్ కోసం చాలా రకాల పధకాలు, మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే అనువైంది, రిస్క్ లేనిదిగా ఎస్ఐపీ లు ప్రత్యామ్నాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Best SIP Plans: పెట్టుబడులు పెట్టేందుకు లేదా సేవింగ్స్ కోసం చాలా రకాల పధకాలు, మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే అనువైంది, రిస్క్ లేనిదిగా ఎస్ఐపీ లు ప్రత్యామ్నాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఎస్ఐపీల్లో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ సంపాదించవచ్చంటున్నారు. ప్రతి నెల తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ..భారీగా నిధులు కూడగట్టాలంటే ఎస్ఐపీ మీకు అద్భుతమైన విధానం. ఎస్ఐపీ ద్వారా పెట్టుబడులు పెడితే..ఏ విధంగా సంపాదించగలరో పరిశీలిద్దాం.
ఆధునిక పోటీ ప్రపంచంలో..రోజువారీ ఖర్చులతో పాటు భవిష్యత్ కోసం కూడా ప్లానింగ్ అవసరమౌతుంటుంది. అందుకే సురక్షితమైన పెట్టుబడులు తప్పనిసరి. పెట్టుబడులకు ఓ పరిమితి గానీ, ఓ సమయం గానీ ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా ఎంతైనా పెట్టవచ్చు. మీ ఆదాయంలోని ఓ భాగాన్ని కచ్చితంగా పెట్టుబడుల్లో పెడితే భవిష్యత్తులో మంచి లాభాలుంటాయి.
పొదుపు కోసం మనకు చాలా విధానాలున్నాయి. కానీ కొన్నింటిలో డబ్బులు పెట్టుబడి పెట్టడం మంచి పద్ధతి. ఇప్పటివరకూ మీరు ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోతే..ఇక ఆలస్యం చేయవద్దు. తక్కువ బడ్జెట్లోనే మంచి ఫండింగ్ ఎలా సిద్ధం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అయితే నిర్ణీత పెట్టుబడులు తప్పనిసరి.
నెలకు వేయి రూపాయలే..సంపాదన కోటి వరకూ
చిన్న చిన్నపెట్టుబడులతో భారీగా నిధులు జమ చేసేందుకు మీరు ప్రారంభంలో నెలకు వేయి రూపాయల్నించి ప్రారంభించండి. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ప్రయోజనకరం. మీరు కూడా నెలకు వేయి రూపాయలు పెట్టుబడి పెడుతూ.కోటీశ్వరుడిగా మారవచ్చు.
దీనికోసం ప్రతినెలా వేయి రూపాయలు పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్‌లో 20 శాతం కంటే ఎక్కువే రిటర్న్ వస్తోంది. అంటే మీరు ఈ డబ్బుల్ని 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే..మొత్తం 2.4 లక్షలు జమ అవుతాయి. 20 ఏళ్లలో ఏడాదికి 15 శాతం రిటర్న్ లెక్కేసుకుంటే 15 లక్షల 16 వేల రూపాయలు లభిస్తాయి. అదే ఒకవేళ రిటర్న్ 20 శాతం లభిస్తే మొత్తం 31.61 లక్షలు వస్తుంది.
ఒకవేళ మీరు ప్రతినెలా వేయి రూపాయల చొప్పున 25 ఏళ్ల వరకూ పెట్టుబడి పెడితే..దీనిపై మీకు 20 శాతం ఏడాదికి రిటర్న్ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ పూర్తయిన తరువాత 86.27 లక్షలు లభిస్తాయి. అదే విధంగా 30 ఏళ్లు పూర్తయితే..20 శాతం రిటర్న్ చొప్పున మీకు 2 కోట్ల 33 లక్షల 60 వేల రూపాయలు లభిస్తాయి.
మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు దీర్ఘకాలిక లాభం కలుగుతుంది. దాంతోపాటు ఇందులో ప్రతి నెలా పెట్టుబడి పెట్టే సౌకర్యముంటుంది. అందుకే చిన్న మొత్తం పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలుంటాయి.
Also read: Indian Railways: మీ రైల్వే టికెట్ మరో వ్యక్తికి బదిలీ చేయవచ్చని తెలుసా..ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook