Sony BRAVIA X75K 4K TV: ప్రముఖ సంస్థ సోని  భారతదేశంలోని వినియోగదారులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. సరికొత్త మోడల్‌ BRAVIA X7 5K  స్మార్ట్ టీవీని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టీవి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం 4K ప్యానెల్‌ సమర్థ్యంతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో ఉండే ప్రత్యేకమైన ఫీచర్‌తో రిచ్, లైఫ్‌లైక్ విజువల్స్‌ను ఉత్పత్తి చేయగలదు. సోనీ  BRAVIA X7 5K  65-అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 43, 50, 55తో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ టీవికి స్క్రీన్ చుట్టూ స్లిమ్ ఫ్రేమ్‌తో స్లిమ్ బెజెల్‌లను అమర్చారు. దీంతో టీవి చూసే సమయంలో విజువల్స్‌ ఆవుట్‌ఫుట్‌ సక్రమంగా ఉంటుంది. భారతదేశంలో సోనీ BRAVIA X75K స్మార్ట్ టీవీ ధరలు, ఫీచర్లను తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sony BRAVIA X75K ధర:
సోనీ BRAVIA X75K 34-అంగుళాల మోడల్ ధర రూ. 55,990,  50-అంగుళాల మోడల్ ధర రూ. 66,990ల్లో లభించనుంది. ఇది భారత్‌లోని అన్ని సోనీ షోరూం, ఎలక్ట్రానిక్ దుకాణాలు, ఇ-కామర్స్ సైట్‌ల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 55 అంగుళాలు, 65 అంగుళాల మోడళ్ల ధరలు త్వరలో ప్రకటిస్తామని సంస్థ తెలిపింది.


Sony BRAVIA X75K ఫీచర్లు:
Sony BRAVIA X75K  X1 చిప్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇందులో 16GB ఆన్‌బోర్డ్  సమర్థ్యం కలిగిన మెమోరిని అమర్చారు. ఇది Google Play Store, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో పాటు.. Android TV OSపై పని చేస్తుంది. వినియోగదారులు వారికి ఇష్టమైన వీడియోలు, గేమ్‌లు, యాప్‌లను వారి స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ నుంచి నేరుగా వారి టీవీలో ప్రసారం చేయడానికి వీలుంటుంది. ఇవే కాకుండా స్మార్ట్ టీవీలో Wi-Fi 5, బ్లూటూత్ 5.0, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, ఒక RF పోర్ట్ వంటి అనేక కనెక్టివిటీలు ఉన్నాయి.


సోనీ BRAVIA X75K స్పెసిఫికేషన్స్‌:


#డిస్‌ప్లే HDR10 మద్దతుతో 4K (2160×3840 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌
#LED ప్యానెల్‌తో సోనీ BRAVIA X75K
#లైవ్ కలర్ టెక్నాలజీ  డిస్‌ప్లే 
#స్పష్టమైన రంగులను ఉత్పత్తి 
#మోషన్‌ఫ్లో XR వేగంగా కదిలే దృశ్యాలు
#BRAVIA X75K X-Reality PRO సాంకేతికత
#1080p వరకు 4K రిజల్యూషన్‌
#శక్తివంతమైన బాస్ రిఫ్లెక్స్ స్పీకర్‌లు 
#డాల్బీ ఆడియో


Also Read:  Illicit Affair: ప్రాణాల మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం... అతని మర్మాంగాలు కోసేసిన యువతి


Also Read: Sai Pallavi Marriage: సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా! ఆ వార్తలు ఎంత బాధిస్తాయో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook