Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతోంది. మోయలేని భారంగా మారిన నిత్యవసరాల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యంపై లక్షల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు. పాలకుల పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంకన్​ స్టాక్ మార్కెట్​ను ఒక వారం పాటు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీలంక సెక్యూరిటీస్​ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్​ (సీఎస్​ఈ) అధికారిక ప్రకటన కూడా చేసింది.


ఎస్​ఈసీ ఏం చెప్పిందంటే..


శ్రీలంక మార్కెట్​పై పెట్టుబడిదారులు మరింత స్పష్టత ఇవ్వడం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్​ఈ పేర్కొంది. ఈ కారణంతోనే 2022 ఏప్రిల్ 18 నుంచి 22 వరకు తాత్కాలికంగా ఎక్స్ఛేంజీని మూసేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


ఈ విషయంపై సంబంధిత వివరాలను, నిబంధనలను కొలంబో స్టాక్​ బ్రోకర్స్​ అసోసియేషన్​ సహా ఇతర అన్ని వర్గాలకు ఇచ్చినట్లు వివరించింది.


శ్రీలంక సంక్షోభానికి కారణం..


శ్రీలకం ప్రధానంగా టూరిజంపైనే ఆధారపడే దేశం. అయితే 2020లో కొవిడ్ కారణంగా టూరిజం పూర్తిగా నిలిచిపోయింది. దీనితో దేశంలో ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అధికంగా కరెన్సీ ముద్రించడం, అప్పులు చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. దీనితో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. డిమాండ్​కు తగ్గ సప్లయి లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి వాటికి కొరత ఏర్పడింది. ఇంధన కొరత కారణంగా ఆ దేశంలో రోజుకు 10 గంటలకుపైగానే కరెంట్ కోతలు చేస్తోంది ప్రభుత్వం.


Also read: Mysterious Liver Illness: ప్రపంచాన్ని భయపెడుతున్న మరో అంతుచిక్కని వ్యాధి.. అమెరికా, యూకెల్లో బయటపడిన కేసులు...


Also read: Rare Incident: హస్త ప్రయోగం ఎఫెక్ట్... ఊపిరితిత్తులు దెబ్బతిని ఆసుపత్రిలో చేరిన యువకుడు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook