SBI Alerts: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను అప్రమత్తం చేస్తూ కొత్తగా సూచనలు చేసింది. సైబర్ మోసాన్ని అరికట్టే క్రమంలో భాగంగా కొన్ని రకాల మెస్సేజ్‌ల విషయంలో హెచ్చరిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. వివిధ రకాలుగా మెస్సేజ్‌లు పంపిస్తూ ఖాతాదారుడి ఖాతాను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కస్టమర్లు మోసపోయిన సందర్భాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను హెచ్చరిస్తోంది. ఎస్బీఐ పంపించినట్టుగా వస్తున్న ఎలాంటి మెస్సేజిలకు స్పందించవద్దని కోరుతోంది. 


ఎటువంటి మెస్సేజ్‌లు


ఎస్బీఐ పేరుతో కొందరు మోసగాళ్లు..పాన్‌కార్డు వివరాల్ని అప్‌డేట్ చేయాలని..యోనో ఖాతా డీయాక్టివేట్ చేశామని మెస్సేజిలు పంపిస్తున్నారు. దాంతోపాటు ఒక లింక్ పంపిస్తూ..పాన్‌కార్డు వివరాల్ని అప్‌డేట్ చేయమని కోరుతున్నారు. ఆ లింక్ పొరపాటున ప్రెస్ చేశామో..అంతే ఇక..మీ ఖాతా ఖాళీ అయిపోతుంది. 


పెండింగ్‌లో ఉన్న కేవైసీ ధృవీకరణ, యోనో ఖాతా సస్పెన్షన్, సిమ్‌ కార్డ్ బ్లాక్, పాన్‌కార్డు ధృవీకరణ వంటి వివరాలు కోరుతూ వచ్చే ఎస్ఎంఎస్‌లపై జాగ్రత్తగా ఉండాలని వాటిపై స్పందించడం గానీ, ప్రత్యుత్తరం ఇవ్వడం గానీ చేయవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని కోరుతూ ఏదైనా మెస్సేజ్ లేదా మెయిల్ వస్తే దానికి సమాధానం ఇవ్వవద్దని ఎస్బీఐ చెబుతోంది. సందేశంతో పాటు లింక్ వస్తే..దాన్ని క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తోంది. 


ఈ తరహా ఫేక్ మెస్సేజ్‌లు వస్తే report.phishing@sbi.co.in కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చు. 


Also read: FD vs KVP Interest Rates: బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పధకమేంటో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook