Stock Market today: స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. నేటి సెషన్​లో (గురువారం) సూచీలు స్వల్ప లాభాలను (stocks closing bell) నమోదు చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 85 పాయింట్లు బలపడి 61,235 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 45 పాయింట్ల లాభంతో 18,257 వద్ద స్థిరపడింది.


స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదవడం వరుసగా ఇది ఐదో సెషన్​. లోహ, ఫార్మా, ఆటో, ఐటీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.


దేశాన్ని ఓ వైపు కొవిడ్ మూడో దేశ భయాలు వెంటాడుతున్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం ముందుకే దూసుకెళ్తుండటం విశేషం.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 61,348 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  60,949 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,272 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,163 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 20 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 10 కంపెనీలు డీలా పడ్డాయి.


టాటా స్టీల్​ 6.40 శాతం, సన్​ఫార్మా 3.53 శాతం, ఎల్​&టీ 2.30 శాతం, ఎం&ఎం 1.66 శాతం, పవర్​ గ్రిడ్​ 1.49 శాతం లాభాలను గడించాయి.


విప్రో 6 శాతం, ఏషియన్ పెయింట్స్​ 2.47 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ 1.81 శాతం, ఇండస్​ ఇండ్ బ్యాంక్​ 1.55 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.46 శాతం నష్టపోయాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. థైవాన్​, హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను నమోదు చేశాయి.


షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా) సూచీలు నష్టపోయాయి.


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ (Rupee Value today) రూ.73.87 వద్ద కొనసాగుతోంది.


Also read: Tecno Pop 5 LTE: జియో స్మార్ట్ ఫోన్ కు పోటీగా భారత మార్కెట్లోకి Tecno మొబైల్స్ కొత్త వేరియంట్


Also read: Amazon New Sale: అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​డే సేల్​ డేట్ వచ్చేసింది- పూర్తి వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook