Amazon New Sale: అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​డే సేల్​ డేట్ వచ్చేసింది- పూర్తి వివరాలు ఇవే..

Amazon New Sale: అమెజాన్ ఇండియా మరోసారి భారీ డిస్కౌంట్లు ప్రకటించనుంది. 'గ్రేట్​ రిపబ్లిక్ డే సేల్'ను ప్రారంభించనుంది. ఈ సేల్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 04:51 PM IST
  • మరో కొత్త సేల్​ ప్రకటించిన అమెజాన్​ ఇండియా
  • వచ్చే వారం నుంచే విక్రయాలు ప్రారంభం
  • స్మార్ట్​ఫోన్లు, టీవీలపై అదిరే డిస్కౌంట్లు
Amazon New Sale: అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​డే సేల్​ డేట్ వచ్చేసింది- పూర్తి వివరాలు ఇవే..

Amazon New Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి భారీ సేల్​ను ప్రకటించింది. రిపబ్లిక్​ డే సందర్భంగా ఈ సేల్​ను తీసుకురానుంది. 'గ్రేట్​ రిపబ్లిక్ డే సేల్'​ పేరుతో ఈ సేల్ (Amazon Great Republic Day Sale)​ నిర్వహింనుంది.

సేల్​ గురించి మరిన్ని వివరాలు..

ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సేల్ (Amazon Great Republic Day Sale date) కొనసాగనుంది. అమెజాన్​ ప్రైమ్ సబ్​స్రైబర్లకు మాత్రం ఈ సేల్​ 24 గంటల ముందు అంటే 16వ తేదీనే అందుబాటులోకి రానుంది.

అయితే ఎప్పటిలానే స్మార్ట్​ఫోన్లు, టీవీలు ఎలక్ట్రానిక్స్​, హోం, కిచెన్​ అప్లయిన్సెస్​పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు (Amazon offers on smartphones) తెలిసింది.

స్మార్ట్​ఫోన్లపై 40 శాతం  వరకు, ఎలక్ట్రానిక్స్​ (కెమెరాలు, ల్యాప్టాప్​ల వంటివి)పై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించే వీలుందని (Amazon new sale) సమాచారం.

ఇక పెద్ద సైజు టీవీలు, ఫ్రిడ్జ్​ల వంటివాటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ (Amazon offers on TVs) ఇవ్వనున్నట్లు సమాచారం.

బ్యాంక్ ఆఫర్​ కోసం ఈ సారి ఎస్​బీఐ కార్డ్స్​, అమెజాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఆఫర్​ ప్రకారం.. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్ (SBI card offers on Amazon)​ ఉపయోగించే చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది.

ఇక బజాజ్ ఫినాన్స్ కార్డ్​పై నో కాస్ట్​ ఈఎంఐని కూడా ఇవనుంది అమెజాన్ (Amazon offer deals)​ ఇండియా.

స్మార్ట్​ఫోన్లపై రూ.16 వేల వరకు ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ కూడా ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది.

వివిధ మొబైళ్లపై ఆఫర్లు ఇలా..

రెడ్​మీ నోట్​ 10ఎస్​ ధరను రూ.16,999 కన్నా తక్కువకే విక్రయించే వీలుంది. శాంసంగ్​ గెలాక్సీ ఎం12 ధరను రూ.12,999కన్నా (Amazon offers on Samsung phones) దిగువకు తగ్గించే వీలుంది. గేమింగ్​ ఫోన్​ ఐకూ జెడ్​ 3 ధరను రూ.22,990 తక్కువకు విక్రయించే అవకాశాలున్నాయి. త్వరలోనే మోడళ్ల వారీగా ఆఫర్లు ప్రకటించే (Amazon Great Republic Day Sale offers) వీలుంది.

Also read: Stock Market today: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర- 61 వేల మార్క్​పైకి సెన్సెక్స్​

Also read: Petrol Diesel Update: వాహనదారులకు గుడ్ న్యూస్- 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News