Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంతంలో (stocks closing bell) స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 143 పాయింట్లు బలపడి 59,745 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 67 పాయింట్ల లాభంతో 17,813 వద్ద స్థిరపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా భయాలు కొనసాగుతున్నా సూచీలు నేడు ఉత్సాహంగా ముందుకే దూసుకెళ్లాయి. హెవీ వెయిట్​ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఎఫ్​ఎంసీజీ షేర్లు అధికంగా లాభాలను గడించాయి.


ఐటీ షేర్లు నిన్నటి నష్టాల నుంచి తేరుకోవడం కూడా మార్కెట్లకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​  60,130 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  59,401 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,905 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,704 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 15 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.. 15 కంపెనీలు డీలా పడ్డాయి.


ఏషియన్ పెయింట్స్ 1.79 శాతం, టీసీఎస్​ 1.26 శాతం, నెస్లే 1.23 శాతం, అల్ట్రాటెక్​ సిమెంట్ 1.81 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్​ 1.06 శాతం లాభాలను గడించాయి.


బజాజ్​ ఫిన్​సర్వ్​​ 1.39 శాతం, ఎం&ఎం 1.31 శాతం, ఎల్​&టీ 1.06 శాతం, బజాజ్ ఫినాన్స్​ 1 శాతం, హెచ్​డీఎఫ్​సీ 0.98 శాతం నష్టాలను నమోదు చేశాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్​ (దక్షిణ కొరియా), హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను నమోదు చేశాయి.


షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), థైవాన్​ సూచీలు నష్టపోయాయి.


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద (Rupee value today) కొనసాగుతోంది.


Also read: Gold Price Today January 7 2022 : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...


Also read: Samsung Galaxy S22: అద్దిరిపోయే ఫీచర్లతో కస్టమర్లను టెంప్ట్ చేస్తోన్న స్మార్ట్ ఫోన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook