Stocks To Buy:  HMPV కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలు నమోదయ్యాయి. నిఫ్టీ 388 పాయింట్లు పతనమై 23616 వద్ద ముగిసింది. నిఫ్టీ 200 DEMA (23650) కంటే దిగువన ముగిసింది. ఇది స్వల్పకాలంలో మరింత క్షీణతను సూచిస్తుంది. నేడు, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో మూడు, పావు శాతం క్షీణత ఉండగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో మూడు, పావు శాతం క్షీణత నమోదైంది. ఈ బలహీనమైన మార్కెట్‌లో, హెల్త్‌కేర్ స్టాక్‌లలో మాత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. పెరుగుతున్న HMPV కేసుల కారణంగా ఈ రెండు హెల్త్ స్టాక్‌లలో మంచి పెరుగుదల నమోదు అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ డయాగ్నోస్టిక్ షేర్ ధర లక్ష్యం: 


హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ విజయ డయాగ్నోస్టిక్ షేర్లను రూ. 1130-1092 రేంజ్‌లో కొనుగోలు చేసి సగటున ఉంచాలని సూచించింది. ఈ షేరు నేడు ఒకటిన్నర శాతం పెరుగుదలతో రూ.1129 వద్ద ముగిసింది. పడిపోతే రూ.1073 స్టాప్ లాస్ ఉంచాలని, వచ్చే 10 రోజులకు రూ.1210 టార్గెట్ పెట్టుకున్నారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.1250,కనిష్ట ధర రూ.596 చేరుకుంది. ఈ స్టాక్ గత వారంలో 7.2శాతం, గత రెండు వారాల్లో 7శాతం రాబడిని ఇచ్చింది.


Also Read: HMPV: గుజరాత్‌లో తొలి చైనా వైరస్‌ కేసు.. భారత్‌లో మూడో హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌..!  


నారాయణ హృదయాలయ షేర్ ధర లక్ష్యం:


1332-1309 శ్రేణిలో కొనుగోలు చేయడం.. సగటున నారాయణ హృదయాలయను కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సూచించింది. ఈ షేర్ 0.4% పెరుగుదలతో రూ.1315 వద్ద ముగిసింది. ఒకవేళ తగ్గితే రూ.1290 స్టాప్ లాస్ ఉంచాలని, వచ్చే 10 రోజులకు రూ.1395 టార్గెట్ పెట్టుకున్నారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.1445, కనిష్ట ధర రూ.1088. ఈ స్టాక్ గత వారంలో 3.2%  గత రెండు వారాల్లో 0.5% రాబడిని ఇచ్చింది.


Also Read: సంక్రాంతికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ కారుపై ఏకంగా 3 లక్షల వరకు డిస్కౌంట్..పండుగ ఆఫర్ అదరహో


(Disclaimer: ఇక్కడ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలనే సలహా బ్రోకరేజ్ హౌస్ ద్వారా అందించింది మాత్రమే. ఇవి జీ తెలుగు  అభిప్రాయాలు కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ సలహాదారుని సంప్రదించండి.)


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.